ETV Bharat / business

ఎస్​ బ్యాంక్​కు మరో ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం

సంక్షోభంలో చిక్కుకున్న ఎస్​ బ్యాంక్​ నూతన బోర్డులో మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించింది భారతీయ రిజర్వు బ్యాంక్. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్​ గాంధీ, ఎస్​పీ జైన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ అండ్ రీసెర్చ్​ ప్రొఫెసర్ అనంత్ నారాయణన్​ను అదనపు బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 26 నుంచి వీరి నియమాకం అమలు కానుంది.

additional directors
ఎస్​ బ్యాంక్​కు మరో ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం
author img

By

Published : Mar 20, 2020, 8:42 PM IST

ఎస్​ బ్యాంక్​ పునరుద్ధరణ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ). ఇందులో భాగంగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్​ గాంధీ, ఎస్​పీ జైన్​ ఇన్​స్టీట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ అండ్ రీసెర్చ్​ ప్రొఫెసర్ అనంత్ నారాయణన్​ను అదనపు బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

వీరి నియామకం మార్చి 26 నుంచి రెండేళ్ల వరకు అమలులో ఉండనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మార్చి 14 నుంచి అమలులోకి వచ్చిన ఎస్ బ్యాంక్ పునరుద్ధరణ పథకం ప్రకారం ఇంకా ఓ అదనపు డైరెక్టర్​ను నియమించేందుకు ఆర్బీఐకి అధికారాలున్నాయి.

సంక్షోభంతో మారతున్న ఎస్​ బ్యాంక్ స్వరూపం

ఎస్ బ్యాంక్ భారీ రుణ ఊబిలో చిక్కుకున్న కారణంగా బ్యాంకుపై మార్చి 5న మారటోరియం విధించింది ఆర్బీఐ. ఆ తర్వాత బ్యాంకు బోర్డును రద్దు చేసి ఆ స్థానంలో కొత్త బోర్డును నియమిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 18 నుంచి మారటోరియం ఎత్తివేసి బ్యాంకు సీఈఓ, ఎండీ బాధ్యతలు ప్రశాంత్​ కుమార్​కు అప్పగించిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన కూడా మార్చి 26న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎస్​ బ్యాంక్​ కొత్త బోర్డును నాన్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ పదవిలో సునీల్ మెహతా, నాన్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ హోదాలో మహేశ్​ కృష్ణమూర్తి, అతుల్ భేడా నేతృత్వం వహించనున్నారు.

ఇదీ చూడండి: కరోనా సోకుతుందన్న ఆందోళనలో 'రానా'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.