ETV Bharat / business

'బిగ్​బుల్​'కు పది నిమిషాల్లోనే రూ.186 కోట్ల లాభం! - పది నిమిషాల్లో రూ.186కోట్లు

Rakesh Jhunjhunwala earns: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు నష్టాలను ఎదుర్కొని మంగళవారం లాభాల బాట పట్టగా.. 'బిగ్​బుల్​' రాకేశ్​ ఝున్​ఝున్​వాలాపై కాసుల వర్షం కురిసింది. కేవలం పది నిమిషాల్లో ఏకంగా రూ. 186 కోట్లు గడించారు ఝున్​ఝున్​వాలా.

Rakesh Jhunjhunwala
రాకేశ్​ ఝున్​ఝున్ వాలా
author img

By

Published : Feb 15, 2022, 12:45 PM IST

Rakesh Jhunjhunwala record profit: వరుస నష్టాలతో భారీగా కుదేలైన స్టాక్​ మార్కెట్​లు మంగళవారం పుంజుకున్నాయి. వివిధ రంగాల షేర్లు కోలుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా బిగ్​బుల్​ రాకేశ్​ ఝున్​ ఝున్​వాలాపై కాసులు వర్షం కురిసింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే తాను పెట్టుబడి పెట్టిన రెండు కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి. దీంతో ఏకంగా రూ. 186 కోట్లు వచ్చి పడ్డాయి. ఆ రెండు కంపెనీలూ.. టాటా గ్రూప్​నకు చెందినవి కావడం విశేషం. వాటిలో ఒకటి టాటా మోటార్స్​ కాగా.. మరొకటి టైటాన్​.

సోమవారం ఎన్​ఎస్ఈ సెషన్​ క్లోజింగ్​ నాటికి రూ.2,398 ఉన్న టైటాన్​ షేర్​ విలువ మార్కెట్​ ఓపెనింగ్​ సెషన్​లో రూ. 23.95 పెరిగి.. రూ.2,435 లకు చేరింది. ఇదే విధంగా టాటా మోటార్స్​ షేర్​ కూడా రూ. 4.70 పెరిగి రూ.476.15కి చేరింది. దీంతో కేవలం పదే నిమిషాల్లో రూ. 186 కోట్ల ఝున్​ఝున్​వాలా పోర్ట్​ఫోలియోలో వచ్చి చేరాయి.

టైటాన్​లో రాకేశ్​కు 3,37,60,395 షేర్లు ఉండగా ఆయన సతీమణి రేఖా ఝున్​ఝున్​వాలా 95,40,575 షేర్లు కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిపి మొత్తం 4,33,00,970 షేర్లు ఉన్నాయి. టాటా మోటార్స్​లో రాకేశ్​కు 3,67,50,000 షేర్లు ఉన్నాయి.

ఇదీ చూడండి: Air India CEO: ఎయిర్​ ఇండియా కొత్త సీఈఓగా ఇల్కర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.