ETV Bharat / business

'ఆటో'పై కరోనా దెబ్బ- 20 ఏళ్లలో తొలిసారి ఇలా... - వాహన రంగ అమ్మకాలపై కరోనా దెబ్బ

గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వాహన రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో 78,43 శాతం, వాణిజ్య వాహనాల అమ్మకాలు 84.81 శాతం తగ్గాయి. నిజానికి కరోనాకు ముందే మందగమనంలో ఉన్న వాహన రంగం.. లాక్​డౌన్ తర్వాత మరింత సంక్షోభంలో కూరుకుపోయిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

corona impact on auto sector
ఆటో రంగంపై కరోనా కోరలు
author img

By

Published : Jul 14, 2020, 5:09 PM IST

వాహన రంగంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. కరోనాకు ముందే మందగమనాన్ని ఎదుర్కొన్న వాహన రంగం.. ఇప్పుడు మరింత సంక్షోభంలోకి జారుకున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వాహన తయారీ పరిశ్రమల విభాగం 'సియామ్' వెల్లడించిన గణాంకాల ప్రకారం వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ ప్యాసిజర్ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగా 78.43 శాతం పడిపోయాయి. ఏప్రిలో సంపూర్ణ లాక్​డౌన్ ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా సియామ్ పేర్కొంది.

గత 20 ఏళ్లలో ఇదే సుదీర్ఘ మందగమనమని సియామ్ వెల్లడించింది.

ఏప్రిల్-జూన్​లో ప్యాసింజర్ వాహనల విక్రయాలు..

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 1,53,734 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే విక్రయమయ్యాయి. 2019 ఇదే సమయంలో ఈ సంఖ్య 7,12,684 యూనిట్లుగా ఉంది.

గతలో 2013-14 నుంచి 2014-15 మధ్య, 2000-01 నుంచి 2001-02ల మధ్య 5 త్రైమాసికాల్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు పడిపోయాయి.

వాణిజ్య వాహనాల విక్రయాలూ పతనం..

ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు అత్యధికంగా 84.81 శాతం పడిపోయాయి. ఈ మూడు నెలల కాలంలో 31,636 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 ఇదే త్రైమాసికంలో వీటి అమ్మకాలు 2,08,310 యూనిట్లుగా ఉన్నాయి.

ద్విచక్ర, త్రిచక్ర వాహనాల లెక్కలు ఇలా..

2020 ఏప్రిల్ జూన్​ త్రైమాసికంలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ద్విచక్ర వాహనాల విక్రయాలు 75.21 శాతం క్షీణతతో 50,13,067 యూనిట్ల నుంచి 12,93,113 యూనిట్లకు పడిపోయాయి.

త్రిచక్ర వాహనాల విక్రయాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 91.48 శాతం తగ్గాయి. ఈ సమయంలో 12,760 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 1,49,797 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం.

ఇదీ చూడండి:పెప్సికోపై కరోనా దెబ్బ.. విక్రయాలు 25 శాతం డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.