ETV Bharat / business

'కొవిషీల్డ్ టీకా కోసం ఓపికతో ఉండండి' - టీకా కోసం ఓపికతో ఉండండి

కొవిషీల్డ్ టీకా లభ్యతపై ప్రపంచదేశాలు సహనంతో ఉండాలని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. భారతదేశ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, అంతర్జాతీయ అవసరాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.

adar poonawalla
అదర్ పూనావాలా
author img

By

Published : Feb 21, 2021, 1:10 PM IST

కొవిషీల్డ్ టీకా కోసం ఎదురుచూస్తున్న దేశాలు ఓపికతో ఉండాలని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. తొలుత భారతదేశ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తమకు ఆదేశాలు అందాయని తెలిపారు.

భారత్ అవసరాలకు తగ్గట్లుగా టీకాలను సరఫరా చేసి, ఇతర దేశాల అవసరాలను తీర్చేందుకు సమన్వయంతో ప్రయత్నాలు చేస్తామని పూనావాలా ట్వీట్ చేశారు.

  • Dear countries & governments, as you await #COVISHIELD supplies, I humbly request you to please be patient, @SerumInstIndia has been directed to prioritise the huge needs of India and along with that balance the needs of the rest of the world. We are trying our best.

    — Adar Poonawalla (@adarpoonawalla) February 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కొవిషీల్డ్ టీకా కోసం ఎదురుచూస్తున్న వివిధ దేశాలు, ప్రభుత్వాలు సహనంతో ఉండాలని కోరుతున్నా. భారత్​లో అవసరాలను ప్రాధాన్య క్రమంలో తీర్చి, ప్రపంచదేశాలపై దృష్టిసారించాలని సీరం సంస్థకు ఆదేశాలు అందాయి. మేం మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం."

-అదర్ పూనావాలా ట్వీట్

ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరి 15న ఆమోదం తెలిపింది. 'కొవాక్స్' ద్వారా ప్రపంచవ్యాప్తంగా పంపిణీకి పచ్చజెండా ఊపింది. ఈ టీకాలను సీరంతో పాటు ఆస్ట్రాజెనెకా-ఎస్​కేబయో సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

ఇదీ చదవండి: 'స్పుత్నిక్‌ వి' టీకాకు అత్యవసర అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.