ETV Bharat / business

అసలేంటి ఈ 'ఈ-రూపీ' డిజిటల్ పేమెంట్? - ఈ-రూపీ పేమెంట్ అంటే

డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు కేంద్రం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ విధానాన్ని ఆగస్టు 2న ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే.. ఈ 'ఈ-రూపీ' అంటే ఏంటో తెలుసుకుందాం...

e RUPI
ఈ-రూపీ
author img

By

Published : Aug 1, 2021, 6:33 PM IST

డిజిటల్​ పేమెంట్స్​ సులభతరం చేసేందుకు కేంద్రం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈమేరకు 'ఈ-రూపీ' విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. వర్చువల్​గా ఈ కార్యక్రమం జరుగనుంది.

'ఈ-రూపీ' అంటే..

'ఈ-రూపీ' అంటే నగదు రహిత లావాదేవీ కోసం కేంద్రం తీసుకొస్తున్న కొత్త పేమెంట్ విధానం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్​మెంట్, నేషనల్ హెల్త్ అథారిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంయుక్తంగా 'ఈ-రూపీ' విధానాన్ని రూపొందించింది. నగదు రహిత లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఈ విధానాన్ని అమలు చేయనుంది.

e rupi
ఈ-రూపీ పేమెంట్​

లావాదేవి ఎలా?

  • క్యూ ఆర్​ కోడ్​ లేదా ఎస్​ఎంఎస్​ స్ట్రింగ్​ వోచర్​ను లబ్ధిదారుడి మొబైల్​ ఫోన్​కు పంపిస్తారు. ఈ కోడ్​ను లేదా వోచర్​ను ఒకేసారి వినియోగించాలి. అయితే.. ఇంటర్నెట్​ బ్యాంకింగ్, డెబిట్​ కార్డు, డిజిటల్​ పేమెంట్స్​ యాప్​ అవసరం లేకుండానే ఈ లావాదేవీ చేయొచ్చని కేంద్రం తెలిపింది.
  • లావాదేవి పూర్తయిన తర్వాతే సర్వీస్​ ప్రొవైడర్​కు నగదు చేరుతుంది. ముందుగానే పేమెంట్​ జరిగినప్పటికీ.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే సకాలంలో నగదు సర్వీస్​ ప్రొవైడర్​కు చేరతుంది.
  • కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ-రూపీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. శిశు సంక్షేమం, టీబీ నిర్మూలన పథకం, ఆయుష్మాన్​ భారత్ ప్రధాన్​ మంత్రి జన్ ఆరోగ్య యోజన లబ్ధిదారుల కోసం దీన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇది మిగతా వారి కోసం కూడా ఉపయోగించనున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతానికి సోమవారం నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు సాయం అందనుంది.

ఇదీ చదవండి:కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా? ఐటీఆర్​ దాఖలు చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.