ప్రజలకు తక్కువ ధరలో, నమ్మకమైన లావాదేవీలను అందిచడానికి ఫిన్‌టెక్ కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సంస్థ చేపట్టిన కార్యక్రమాలను త్వరలోనే ఓ విప్లవంగా మారే సమయం వచ్చిందని అన్నారు. . గతేడాదిలో ఏటీఎం విత్‌డ్రాల కంటే.. మొబైల్‌తో చేసిన లావాదేవీలే ఎక్కువ అని పేర్కొన్నారు. ఒక్క ఏడాది కాలంలో సుమారు 6 కోట్ల 90 లక్షల రూపే కార్డులను వినియోగదారులు తీసుకున్నట్లు చెప్పిన మోదీ.. వాటి ద్వారా సుమారు 130 కోట్ల లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. ఈ మేరకు ఫిన్ టెక్ ఇన్ఫినిటీ ఫోరమ్‌లో మాట్లాడారు.
ఆర్థిక లావాదేవీల విషయంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం భారీ మార్పును తీసుకువచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆర్థిక సాధికారతను సాధించడంలో సహాయపడే ఫిన్‌టెక్ తీసుకున్న చొరవ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ కొత్త ఆవిష్కరణలు చేయడంలో భారతదేశానికి మరొకటి సాటి రాదని ప్రపంచానికి నిరూపించినట్లు మోదీ గుర్తు చేశారు.
ఇదీ చూడండి: Central Vista: సెంట్రల్ విస్టా పనులు 60 శాతం పూర్తి!