ETV Bharat / business

ఎస్బీఐలో కొత్తగా 14 వేల ఉద్యోగాలు! - SBI RECRUITMENT NEWS

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా ఇటీవల ప్రకటించిన వీఆర్​ఎస్​ పథకం.. ఖర్చు తగ్గించుకునే ప్రక్రియ కాదని వెల్లడించింది. బ్యాంకు కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది 14 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.

SBI
ఎస్బీఐలో 14వేల ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక!
author img

By

Published : Sep 8, 2020, 1:24 PM IST

కరోనా సంక్షోభం వేళ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది భారతీయ స్టేట్​ బ్యాంకు. ఈ ఏడాది 14,000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్​ఎస్​) పథకం.. ఖర్చు తగ్గించుకునేందుకు చేపట్టిన ప్రక్రియ కాదని స్పష్టం చేసింది.

" ఉద్యోగులతో బ్యాంకు స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులో తెచ్చేందుకు కార్యకలాపాలను విస్తరిస్తోంది. అందుకు ఈ ఏడాది 14 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 2.50 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఉద్యోగులకు సౌకర్యాల కల్పనలో మా బ్యాంకు ముందుంటుంది. జాతీయ అప్రెంటిస్​ పథకంలో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోన్న ఏకైక బ్యాంకు ఎస్బీఐ.

- ఎస్బీఐ అధికార ప్రతినిధి.

స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి.. 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు పూర్తయిన ఉద్యోగులు అర్హులు. ఈ పథకానికి 30,190 మంది ఉద్యోగులు అర్హులుగా తేలినట్లు ఇటీవలే వెల్లడించింది బ్యాంకు. అందుకు తగిని విధివిధానాల ముసాయిదాను సిద్ధం చేస్తోంది.

ఇదీ చూడండి: స్వచ్ఛంద పదవీ విరమణకు ఎస్​బీఐ ఉద్యోగులు సిద్ధమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.