పియాజియో ఇండియా ప్రీమియం విభాగంలో 'ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160' పేరుతో కొత్త స్కూటర్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.26 లక్షలు (ఎక్స్-షోరూమ్ పుణె)గా నిర్ణయించింది.
సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తున్న ఈ స్కూటర్ 7,100 ఆర్‌పీఎం వద్ద 11 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలిపింది కంపెనీ. ఈ స్కాటర్ ఫ్యుయల్ ట్యాంక్ సామర్థ్యం 7 లీటర్లని పేర్కొంది.
ప్రత్యేకతలు..
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌తో ఈ మోడల్ లభిస్తుంది. డిజిటల్ స్పీడ్ ఇండికేటర్, ఆర్‌పీఎం మీటర్, మైలేజ్ ఇండికేటర్, టాప్ స్పీడ్ డిస్‌ప్లే, డిజిటల్ ఫ్యుయల్ ఇండికేటర్, ఇంజిన్ మాల్‌ఫంక్షన్ ఇండికేటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.
కావాలనుకున్నప్పుడు స్కూటర్‌ను మొబైల్‌కు అనుసంధానించే సాంకేతికత దీనిలో పొందుపర్చారు. దీనితో వాహన భద్రత పెరగనుందని కంపెనీ తెలిపింది.
'ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160'.. సరికొత్త టెక్నాలజీ, మరింత మంచి ప్రయాణ అనుభూతి అందించడమే కాకుండా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని పియాజియో ఇండియా ఛైర్మన్, ఎండీ డియాగో గ్రాఫీ తెలిపారు.
అధికృత డీలర్లతోపాటు ఆన్‌లైన్‌లో ఈ మోడళ్లను బుక్ చేసుకోవచ్చు. రూ.5,000 చెల్లించి బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది కంపెనీ.
ఇదీ చూడండి:దా'రుణ' యప్లకు దూరంగా ఉండండి:ఆర్బీఐ