ETV Bharat / business

రూ.300 కోట్లతో విశాఖ యూనిట్‌ విస్తరణ: లారస్ - లారస్‌ ల్యాబ్స్

ఔషధ రంగంలో పలు రకాలైన ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌)లు, ఫార్ములేషన్లు తయారు చేసే సంస్థ అయిన లారస్‌ ల్యాబ్స్‌ మరో దఫా విస్తరణ చేపట్టింది. ప్రధానంగా విశాఖపట్టణంలోని ఫార్ములేషన్ల యూనిట్‌ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసే పనిలో నిమగ్నమైంది. కొవిడ్‌-19తో ఔషధ ఎగుమతులు పెరిగాయన్న లారస్​ సీఈఓ డాక్టర్​ చావా సత్యనారాయణ.. ఈనాడుతో ముచ్చటించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..?

Pharmaceutical company Laurus Labs ceo eenadu interview
రూ.300 కోట్లతో విశాఖ యూనిట్‌ విస్తరణ: లారస్
author img

By

Published : May 1, 2020, 9:36 AM IST

ప్రముఖ ఔషధ సంస్థ.. లారస్​ ల్యాబ్స్ విశాఖపట్టణంలోని ఫార్ములేషన్ల యూనిట్​ను విస్తరించే పనిలో నిమగ్నమైంది. దీనిపై రూ.300 కోట్ల వరకూ వెచ్చించనున్నట్లు, పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ చావా సత్యనారాయణ ఈనాడుకు తెలిపారు. ఈ విస్తరణ వచ్చే 18 నెలల్లో పూర్తవుతుందని అన్నారు.

'విశాఖపట్టణం ఫార్ములేషన్ల యూనిట్‌ను ఇప్పటికే పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సామర్థ్యాన్ని విస్తరించాల్సి వస్తోంది.' అని ఆయన వివరించారు.

మెరుగైన వృద్ధి సాధిస్తాం...

తమ యూనిట్లు అన్నీ పూర్తిస్థాయిలో పనిచేయటంతో 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఆదాయాలు, లాభాలు నమోదు చేయగలిగే పరిస్థితి వచ్చిందని డాక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ మెరుగైన వృద్ధి సాధిస్తామని ఆయన చెప్పారు. కంపెనీ చేతిలో.. వచ్చే ఏడాది కాలానికి సరిపడా ఔషధ సరఫరా ఆర్డర్లు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాదిలో అమెరికా, ఐరోపా దేశాల్లో కొన్ని కొత్త ఔషధాలకు అనుమతులు వస్తాయని, తత్ఫలితంగా వ్యాపార పరిమాణం పెరుగుతుందని తెలిపారు.

ముడిపదార్ధాలు వస్తున్నాయి, కానీ..

దేశీయ ఔషధ పరిశ్రమ ముడిపదార్ధాల కోసం చైనా మీద అధికంగా ఆధారపడిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, మళ్లీ చైనా నుంచి ముడిపదార్ధాల రాక మొదలైనట్లు వెల్లడించారు. కానీ బాగా జాప్యం జరుగుతున్నట్లు, పైగా రవాణా ఖర్చులు ఎంతగానో పెరిగిపోయినట్లు తెలిపారు.

'చైనాలో సాధారణ స్థితి నెలకుంటోంది, అందువల్ల ముడిపదార్ధాలు వస్తున్నాయి, కానీ విమాన సర్వీసులు తగినంతగా లేక ఇబ్బందులు తప్పటం లేదు' అన్నారాయన. తమ వరకూ చైనాపై ఆధారపడటం తక్కువని, ఏపీఐలను సొంతంగా తయారు చేసుకుంటున్నామని తెలిపారు.

నికరలాభం రూ.110 కోట్లు

లారస్‌ ల్యాబ్స్‌ కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2019-20) నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ఆదాయం రూ.839 కోట్లు, నికరలాభం రూ.110 కోట్లు, ఈపీఎస్‌ రూ.10.3 నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 32 శాతం, నికరలాభం 155 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.

గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఆదాయం రూ.2,831 కోట్లు కాగా దీనిపై రూ.255 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్‌ రూ.23.93 ఉంది.

మరోపక్క వాటాదార్లకు ఒక్కో షేర్‌కు రూ.1 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలనే ప్రతిపాదనకు గురువారం జరిగిన లారస్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. అదే విధంగా ఈక్విటీ షేర్ల విభజనను కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం లారస్‌ ల్యాబ్స్‌ ఒక్కో షేర్‌ ముఖ విలువ రూ.10. దీన్ని రూ.2 ముఖ విలువ కల 5 షేర్లుగా విభజిస్తారు. ఈ నిర్ణయాలకు కంపెనీ వాటాదార్ల నుంచి అనుమతి తీసుకోవలసి ఉంది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ ఔషధాలు

మలేరియాను అదుపు చేయటానికి ఉద్దేశించిన ఔషధం అయినప్పటికీ కొవిడ్‌-19 బాధితులపై వినియోగించినప్పుడు మెరుగైన ఫలితం ఉంటుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధాన్ని తయారీకి సంబంధించి అవసరమైన క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ సత్యనారాయణ చెప్పారు.

అదేవిధంగా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ ఔషధాలకు సంబంధించి ఏపీఐ లను ఇప్పటికే తాము తయారు చేస్తున్నామని, తుది ఔషధాల (ఫార్ములేషన్లు) తయారీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుమతులు వస్తాయని తెలిపారు.

కొవిడ్‌-19 ప్రభావం...

కొవిడ్‌-19 వల్ల దేశీయ ఫార్మా పరిశ్రమకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదని, పైగా కొన్ని ఔషధాలను ఇతరదేశాలకు అధికంగా ఎగుమతి చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పెరిగినట్లు వివరించారు. ఈ సానుకూలత మరికొంత కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.