ETV Bharat / business

వాహనదారులకు షాక్​- రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు - దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్ ధర బుధవారం 25 పైసలు పెరిగి.. సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. ముంబయిలో లీటర్ పెట్రోల్​ ధర ఏకంగా రూ.91 దాటింది. డీజిల్ ధరలు కూడా పెరిగాయి.

Petrol and Diesel prices hike
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
author img

By

Published : Jan 13, 2021, 12:11 PM IST

Updated : Jan 13, 2021, 12:42 PM IST

పెట్రోల్​, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఐదు రోజుల విరామం తర్వత లీటర్ పెట్రోల్ ధర బుధవారం (దిల్లీలో) 25 పైసలు పెరిగి రూ.84.45 వద్దకు చేరింది. దిల్లీలో పెట్రోల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. డీజిల్ ధర కూడా లీటర్​కు 25​ పైసలు పెరిగి రూ.74.63 వద్ద ఉంది.

ముంబయిలో పెట్రోల్ ధర(లీటర్​కు) ఏకంగా రూ.91.07 వద్దకు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.81.34గా ఉంది. ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 22 పైసల నుంచి 26 పైసల వరకు పెరిగాయి. డీజిల్ ధర 24-28 పైసల మధ్య పెరిగింది.

ప్రధననగరాల్లో ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్ రూ.87.83రూ.81.43
బెంగళూరురూ.87.28రూ.79.12
చెన్నైరూ.87.17రూ.79.94
కోల్​కతారూ.85.90రూ.78.21

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్​కు 57.37 డాలర్ల వద్ద ఉంది. డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర 53.88 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:జాక్​మాకు చైనా షాక్- అలీబాబా జాతీయం?

Last Updated : Jan 13, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.