ETV Bharat / business

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా రేట్లు ఇవే

Petrol rates today: వాహనదారులపై మళ్లీ పిడుగు పడింది. ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్​పై 90పైసలు, డీజిల్​పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

PETROL RATES TODAY
PETROL RATES TODAY
author img

By

Published : Mar 25, 2022, 6:41 AM IST

Updated : Mar 25, 2022, 7:03 AM IST

Petrol rates today: పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండు రోజులు ధరలను పెంచిన చమురు సంస్థలు.. గురువారం విరామం తీసుకున్నాయి! శుక్రవారం మళ్లీ బాదుడు మొదలు పెట్టాయి. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ 90 పైసలు పెరిగింది. డీజిల్​పై 87 పైసలు వడ్డించాయి చమురు సంస్థలు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు..

  • Petrol rate in Hyderabad: పెరిగిన ధరలతో హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89కి చేరుకుంది. డీజిల్ ధర రూ.97.22కి పెరిగింది.
  • Guntur petrol price: గుంటూరులో లీటర్ పెట్రోల్​పై 88 పైసలు వడ్డించాయి చమురు సంస్థలు. డీజిల్​పై 84 పైసలు పెంచాయి. ప్రస్తుతం గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.96, డీజిల్ రూ.98.94కు చేరుకుంది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్ 88పైసలు పెరిగి రూ.111.66కు చేరింది. డీజిల్ లీటర్​కు 84 పైసలు అధికమై.. రూ.97.68కి ఎగబాకింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • Petrol rates in Delhi: దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్​పై 80 పైసల చొప్పున పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.97.85, డీజిల్ ధర రూ.89.11కు చేరింది.
  • ముంబయిలో లీటర్ పెట్రోల్ 84పైసలు, డీజిల్ 85పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ లీటర్ ధర రూ.112.49కు, డీజిల్ ధర రూ.96.68కు ఎగబాకింది.
  • చెన్నైలో లీటర్ పెట్రోల్​పై 75పైసలు వడ్డించాయి చమురు సంస్థలు. డీజిల్​పై 76పైసలు పెంచాయి. దీంతో లీటర్ పెట్రోల్ రూ.103.65కు ఎగబాకింది. డీజిల్ రూ.93.7కు చేరింది.
  • కోల్​కతాలోనూ ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ 83పైసలు పెరిగి 107.16కు చేరగా... డీజిల్ 80పైసలు అధికమై.. రూ.92.2కు చేరుకుంది.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Last Updated : Mar 25, 2022, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.