దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్ ధరలు పెరగగా.. డీజిల్ ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 28 పైసలు పెరిగి 101.25కు చేరగా.. డీజిల్ 16 పైసలు తగ్గింది. ప్రస్తుతం డీజిల్ ధర దిల్లీలో లీటరుకు 89.78గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు పెరగగా, డీజిల్‌పై 17 పైసలు తగ్గింది. పెట్రోల్ రూ. 105.22, డీజిల్ రూ.97.85గా ఉన్నాయి.
- గుంటూరులో లీటరు డీజిల్‌పై 17 పైసలు తగ్గి రూ.99.49కు చేరింది. పెట్రోల్ 28 పైసలు పెరిగి రూ.107.41గా ఉంది.
- వైజాగ్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 28 పైసలు పెరిగి రూ.106.21కు చేరింది. డీజిల్‌పై 16 పైసలు తగ్గి లీటరు రూ. 98.33గా ఉంది.
మెట్రో నగరాల్లో..
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి రూ.101.41కు చేరింది. డీజిల్ 16 పైసలు తగ్గి రూ.92.87గా ఉంది.
- ముంబయిలో లీటర్ డీజిల్ ధర 17 పైసలు తగ్గింది రూ.97.35గా ఉంది. లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి రూ.107.26కు చేరింది.
- చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 24 పైసలు పెరిగి రూ.101.97కు చేరింది. డీజిల్ 15 పైసలు తగ్గి రూ.94.3కి దిగొచ్చింది.
ఇదీ చదవండి : సీఎన్‌జీ కార్లతో పెట్రోల్ భారానికి చెక్!