దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతోంది. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రో ధరలతో పాటు సీఎన్జీ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.
దిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ.43.40 నుంచి రూ.44.30కు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 36 పైసలు పెరిగి రూ.104.56కు చేరగా.. లీటరు డీజిల్ ధర 10పైసలు పెరిగి రూ.97.74కు చేరింది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.106.78, డీజిల్ రూ. 99.39గా ఉంది. పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 10పైసలు పెరిగాయి.
- విశాఖలో పెట్రోల్ ధర లీటర్ రూ.105.58, డీజిల్ ధర రూ. 98.22గా ఉంది. పెట్రోల్‌పై 35 పైసలు , డీజిల్‌పై 9పైసలు పెరిగాయి.
మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు..
- దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 35పైసలు పెరిగి రూ.100.56కు చేరగా.. డీజిల్ ధర లీటరుకు 9 పైసలు పెరిగి రూ. 89.62కు చేరుకుంది.
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌పై 39పైసలు, డీజిల్‌పై 15పైసలు పెరిగింది. పెట్రోల్ ధర రూ.100.62 ఉండగా.. డీజిల్ ధర రూ. 92.65గా ఉంది.
- ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.106.65, లీటర్ డీజిల్ రూ.97.24గా ఉన్నాయి. లీటర్ పెట్రోల్‌పై 34పైసలు, డీజిల్‌పై 9పైసలు పెరిగింది.
- చెన్నైలో లీటర్ డీజిల్ రూ.94.2గా లీటర్ పెట్రోల్ రూ. 101.42గా ఉంది. లీటర్ డీజిల్‌పై 8పైసలు, పెట్రోల్‌పై 31పైసలు పెరిగింది.
ఇదీ చదవండి : ఈ స్కీంలో చేరితే నెలనెలా స్థిరమైన ఆదాయం!