దేశంలో ఐదు రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దిల్లీలో సోమవారం డీజిల్‌పై లీటరుకు 26 పైసలు, పెట్రోల్‌పై 30పైసలు చొప్పున ధర పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 83.77, డీజిల్ రూ. 73.93కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశీయ ధరల్లో కూడా పెరుగుదల ఉన్నట్లు చమురు ఉత్పత్తి సంస్థలు వెల్లడించాయి. బ్యారెల్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్ లో 49.07 డాలర్లుగా ఉంది. డాలరుతో రూపాయి మారకం రు. 73.80తో కొనసాగుతోంది.