దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Price) ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకూ ధరలు రికార్డు స్థాయికి చేరి సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం 29 పైసలు పెరిగి.. రూ.96.47 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్‌పై 29 పైసలు పెరిగి రూ.87.33 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.
దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లోనూ పెట్రోల్ ధర(Petrol Price) లీటర్‌కు 26-30 పైసల మధ్య పెరిగింది. లీటర్ డీజిల్ ధరను 28 పైసల నుంచి 32 పైసల వరకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు (లీటర్‌కు)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.100.26 | రూ.95.19 |
బెంగళూరు | రూ.99.69 | రూ.92.58 |
ముంబయి | రూ.102.64 | రూ.94.76 |
చెన్నై | రూ.97.74 | రూ.91.97 |
కోల్‌కతా | రూ.96.40 | రూ.90.18 |
ఇదీ చదవండి:'కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పెట్రో పన్ను తగ్గించాలి'