దేశంలో పెట్రో ధరల బాదుడు (Petrol price hike) ఆగడం లేదు. దేశవ్యాప్తంగా మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
దిల్లీలో లీటరు పెట్రోల్ ధర లీటర్ 25 పైసలు పెరిగి.. రూ. 102.64 వద్దకు చేరింది. డీజిల్ ధర 30 పైసలు ఎగబాకి.. రూ.91.08గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.106.77కు చేరుకుంది. డీజిల్ ధర 33 పైసలు పెరిగింది. దీనితో లీటర్ డీజిల్ ధర రూ.99.37కు చేరింది.
- విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 25 పైసలు ఎగబాకిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.65కు చేరుకుంది. డీజిల్పై 31 పైసలు పెరిగి.. రూ.99.73కు చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 25 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్ ధర రూ.108.92గా ఉంది. డీజిల్ లీటర్కు 31 పైసలు పెరిగి.. రూ.100.96 వద్ద ఉంది.
ఇతర ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు..
- ముంబయిలో లీటరు పెట్రోల్ (Petrol price in Mumbai) ధర రూ. 108.64గా ఉండగా.. డీజిల్ ధర 98.16కు చేరింది.
- చెన్నైలో లీటరు పెట్రోల్ ధర (Petrol price in Chennai) రూ.100.2, డీజిల్ రూ.95.56గా ఉంది.
- కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర (Petrol price in Kolkata) రూ.103.33, డీజిల్ ధర రూ.94.14కు చేరింది.
- బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 26 పైసలు, 32 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్ పెట్రోల్ ధర (Petrol price in Bengaluru) రూ.106.17కి చేరింది. డీజిల్ ధర లీటర్ రూ.96.62 వద్ద ఉంది.
ఇవీ చదవండి:
- సామాన్యుడిపై మరోసారి పెట్రో పిడుగు
- ఇప్పట్లో పెట్రోల్ ధరల తగ్గుదల లేనట్టే!