దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price today) మళ్లీ పెరిగాయి. వరుసగా ఏడో రోజూ ధరలను పెంచుతూ ఇంధన పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో (Petrol Price in Delhi) లీటరు పెట్రోల్‌పై 30 పైసలు పెరిగింది. తాజా పెంపుతో లీటరు పెట్రోల్ ధర 104.44కి చేరుకుంది. దీంతో పెట్రోల్ ధర సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. (Petrol Price)
పెట్రోల్ దారిలోనే డీజిల్ ధరలు సైతం పెరిగాయి. లీటరు డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 93.18కి పెరిగింది.
ఆర్థిక రాజధానిలో..
ముంబయిలో (Petrol Price in Mumbai) లీటరు పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి.. రూ. 110.38కి పెరిగిపోయింది. లీటరు డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ. 101కి ఎగబాకింది.
ఏపీ, తెలంగాణ ప్రధాన నగరాల్లో...
తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటరు ధర రూ. 108.6కి చేరింది. 38 పైసలు పెరిగిన లీటరు డీజిల్ ధర రూ. 101.62కి పెరిగింది. (Petrol Price today Hyderabad)
వైజాగ్‌లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర 30 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటరు ధర రూ.109.46గా ఉంది. డీజిల్ ధర 36 పైసలు అధికమై.. రూ.101.93కి చేరుకుంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర 31 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 36 పైసలు అధికమైంది. నగరంలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 110.73, డీజిల్ ధర రూ.103.16కి చేరుకుంది.
ఇదీ చదవండి: పెట్రోల్ బంక్ లైసెన్స్‌తోనే ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌కూ అనుమతి