దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశ రాజధాని దిల్లీలో శనివారం.. గత రెండేళ్ల తర్వాత తొలిసారిగా లీటరు పెట్రోల్ ధర రూ.83కు చేరుకుంది.
చమురు సంస్థలు శనివారం లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.83.12కు, లీటర్ డీజిల్ ధర రూ.73.32కు చేరుకుంది. 2018, సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక రేటు. నవంబర్ 20 నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచటం ఇది 13వ సారి. గత 16 రోజుల్లో లీటరు పెట్రోల్ ధర రూ.2 పెరగగా.. డీజిల్ రూ.2.86 మేర పెరిగింది.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 90 రూపాయలకు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర 80రూపాయలకు చేరింది
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న నేపథ్యంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నట్లు అంచనా వేసింది ఐసీఐసీఐ సెక్యూరిటీస్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఈ ఏడాది అక్టోబర్ తర్వాత 34 శాతం మేర పెరిగినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: 2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు బంద్!