పెట్రోల్, డీజిల్ ధరల మోత కొనసాగుతోంది. వరుసగా 16 రోజూ ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సోమవారం లీటర్ పెట్రోల్ ధర 34 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై దాదాపు 60 పైసలు ఎగబాకింది.
16 రోజుల్లో (సోమవారంతో కలిపి) పెట్రోల్ ధర లీటర్‌పై రూ.8.30, డీజిల్ ధర లీటర్‌పై రూ.9.45 పెరిగింది. వరుస ధరల పెంపుతో దిల్లీలో డీజిల్ ధర సరికొత్త గరిష్ఠానికి చేరింది. పెట్రోల్ ధర ఇప్పటికే రెండేళ్ల గరిష్ఠాన్ని దాటింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
నగరం | పెట్రోల్ (లీ) | డీజిల్(లీ) |
దిల్లీ | రూ.79.60 | రూ.78.89 |
హైదరాబాద్ | రూ.82.57 | రూ.77.04 |
బెంగళూరు | రూ.82.13 | రూ.74.96 |
ముంబయి | రూ.86.34 | రూ.77.22 |
చెన్నై | రూ.82.85 | రూ.76.28 |
కోల్‌కతా | రూ.81.25 | రూ.74.12 |
ఇదీ చూడండి:'భూమిని ప్లాట్లుగా విక్రయించినా.. జీఎస్టీ కట్టాల్సిందే'