వరుసగా 15వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 30 నుంచి 35 పైసలు పెరిగింది. డీజిల్ ధర 60 పైసల వరకు పెరిగింది. 15 రోజుల్లో పెట్రోల్ ధర మొత్తం రూ.7.97 పెరగ్గా.. డీజిల్ ధర లీటర్‌పై రూ.8 పెరిగింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
నగరం | పెట్రోల్(లీ) | డీజిల్ (లీ) |
దిల్లీ | రూ.79.27 | రూ.78.31 |
హైదరాబాద్ | రూ.82.23 | రూ.76.48 |
బెంగళూరు | రూ.81.78 | రూ.74.41 |
ముంబయి | రూ.86.02 | రూ.76.67 |
చెన్నై | రూ.82.56 | రూ.75.79 |
కోల్‌కతా | రూ.80.93 | రూ.73.60 |
ఇదీ చూడండి:గడువు ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?