దేశంలో మరోసారి చమురు ధరలు (Petrol Price) పెరిగాయి. దిల్లీలో (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్‌పై 30 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.104.14కి చేరుకుంది. మరోవైపు, డీజిల్ ధర 35 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిల్.. రూ.92.83కు చేరుకుంది.
వాణిజ్య రాజధాని ముంబయిలో (Petrol Price in Mumbai) పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.09, డీజిల్ ధర రూ.100.62కు చేరుకుంది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై (Petrol Price today Hyderabad) 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు పంపిణీ సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.108.33, డీజిల్ ధర రూ.101.27కి పెరిగింది.
విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరిగింది. (Petrol Price in Vizag) దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.16, డీజిల్ ధర రూ.101.57కు చేరుకుంది.
గుంటూర్లో (Petrol Price in Guntur) పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 37 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.110.42, డీజిల్ రూ.102.8కు ఎగబాకింది.
ఇదీ చదవండి: ఆల్‌టైం హై వద్ద పెట్రోల్ రేట్లు- సామాన్యులపై భారం తగ్గేదెలా?