ETV Bharat / business

వరుసగా రెండో రోజూ పెట్రో ధరల పెంపు - పెట్రోల్​ ధరల పెంపు

పెట్రోల్​, డీజిల్​ ధరలను వరుసగా రెండోరోజూ 60 పైసలు పెంచాయి దేశీయ ఆయిల్​ కంపెనీలు. ఫలితంగా దిల్లీలో లీటర్​ పెట్రోల్​ 72.46కు పెరగగా.. డీజిల్​ ధర రూ.70.59కి చేరుకుంది.

Petrol, diesel price
పెట్రో ధరల పెంపు
author img

By

Published : Jun 8, 2020, 10:31 AM IST

వరుసగా రెండో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 60 పైసలు పెంచాయి దేశీయ చమురు సంస్థలు. ఫలితంగా దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 72.46కు చేరుకోగా డీజిల్ ధర రూ.70.59కి పెరిగింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు 83 రోజుల విరామం తర్వాత రోజువారీ సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి. తొలి రోజూ పెట్రోల్​, డీజిల్​పై 60పైసలను పెంచాయి ఆయిల్ కంపెనీలు.

సుంకాల వడ్డింపు..

అంతర్జాతీయ మార్కెట్​లో అనిశ్చితి కారణంగా విమాన ఇంధనం ఏటీఎఫ్, వంటగ్యాస్​ ధరలను క్రమంగా సవరించాయి. పెట్రో ధరలపై మాత్రం మార్చి 16 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాలను వడ్డించింది ప్రభుత్వం.

తొలుత రూ.3 పెంచిన కేంద్రం, అనంతరం పెట్రోల్​పై రూ.10, డీజిల్​పై రూ.13 విధించాయి. ఆయిల్​ కంపెనీలు కూడా బీఎస్​-6 విధానానికి మారిన తర్వాత ఇదే సూత్రాన్ని పాటించాయి. అంతర్జాతీయంగా తగ్గిన ధరల నుంచి లాభాలను స్వీకరించి పెట్రో ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.

ఇదీ చూడండి: 80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.