ETV Bharat / business

కొవిడ్‌ ముందు స్థితికి పెట్రోల్‌ అమ్మకాలు - పూర్వ స్థితికి పెట్రోల్‌ అమ్మకాలు

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్​డౌన్​తో కనిష్ఠ స్థాయికి పడిపోయిన పెట్రోల్​ అమ్మకాలు క్రమంగా పుంజుకుని కొవిడ్​ ముందు స్థాయికి చేరుకున్నాయి. 2019 సెప్టెంబర్​ విక్రయాలతో పోలిస్తే.. ఈసారి 2 శాతం వృద్ధి నమోదు చేశాయి. డీజిల్​ విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Petrol demand
కొవిడ్‌ ముందు స్థాయికి పెట్రోల్‌ అమ్మకాలు
author img

By

Published : Oct 2, 2020, 8:11 AM IST

దేశంలో పెట్రోల్‌ విక్రయాలు కొవిడ్‌ముందు స్థితికి చేరాయి. 2019 సెప్టెంబరుతో పోలిస్తే గత నెలలో 2 శాతం పెరిగాయి. అదే ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే 10.5 శాతం వృద్ధి నమోదైంది. డీజిల్‌ విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్ల గణాంకాలు వెల్లడిస్తున్నారు.

గత సెప్టెంబరులో పెట్రోల్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 2 శాతం పెరిగితే గత ఆగస్టుతో పోలిస్తే ఏకంగా 10.5 శాతం పెరిగాయి. డీజిల్‌ విక్రయాలు మాత్రం 2019 సెప్టెంబరుతో పోలిస్తే 7 శాతం తగ్గాయి. అయితే, ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే గిరాకీ 22 శాతం పెరగడం విశేషం.

వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రావడం వల్ల పెట్రోల్‌ వినియోగం పెరిగింది. ఇదే సమయంలో పాఠశాల బస్సులు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల డీజిల్‌కు గిరాకీ తక్కువగా ఉందని బీపీసీఎల్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) అరుణ్‌ కుమార్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. 'ఈ ఏడాది చివరికల్లా కరోనా వైరస్‌ పూర్వపు స్థితికి ఇంధన వినియోగం చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పండుగల సీజన్‌ కావడం వల్ల అక్టోబరులో ఇంధనానికి గిరాకీ మరింత పెరిగొచ్చు' అని ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య అభిప్రాయపడ్డారు.

  • 2020 సెప్టెంబరులో పెట్రోల్‌ విక్రయాలు 2.2 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. 2019 సెప్టెంబరులో ఇవి 2.16 మిలియన్‌ టన్నులే. 2020 ఆగస్టులో 1.9 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ విక్రయమైంది
  • డీజిల్‌కొస్తే 2019 సెప్టెంబరులో 5.2 మిలియన్‌ టన్నులు.. గత నెలలో సెప్టెంబరులో 4.84 మిలియన్‌ టన్నులు విక్రయమైంది. ఈ ఏడాది ఆగస్టులో 3.97 మిలియన్‌ టన్నుల విక్రయాలు నమోదయ్యాయి.
  • జెట్‌ ఇంధన విక్రయాలు మాత్రం 2019 సెప్టెంబరుతో పోలిస్తే 54 శాతం తగ్గి, 6,18,000 టన్నులుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో పోలిస్తే మాత్రం 22.5 శాతం పెరిగాయి.
  • వంట గ్యాస్‌ ఎల్‌పీజీ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి, 2.28 మిలియన్‌ టన్నులకు చేరగా, నెలవారీ ప్రాతిపదికన 3.5 శాతం పెరిగాయి.

ఇదీ చూడండి: దేశంలో ప్రతి పెట్రోల్ బంకులో ఈవీ ఛార్జర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.