రెండు రోజుల విరామం తర్వాత చమురు సంస్థలు మరోసారి ఇంధన ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) ప్రకటించాయి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.94కు చేరగా.. డీజిల్ ధర రూ.96.68కు ఎగబాకింది.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి (Mumbai Diesel Price Today) రూ.113.46కు చేరగా.. లీటర్ డీజిల్ 37 పైసలు పెరిగి రూ.104.71 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ (Kolkata Today Diesel Price) ధర 34 పైసలు పెరిగి రూ.108.41గా ఉంది. లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.99.75 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి (Chennai Diesel Price Today) రూ.104.79 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 34 పైసలు రూ.100.89కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.112.23కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్‌కు రూ.105.42 కి చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్‌కు రూ.114.24కి చేరింది. డీజిల్‌పై 36 పైసలు పెరిగి లీటర్ రూ.106.82 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.98 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.60కి చేరింది.
ఇదీ చూడండి : ఫోన్‌పేలో యూపీఐ లావాదేవీలు ఉచితమే.. కానీ...