దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి ఆల్‌టైం రికార్డ్ స్థాయికి చేరువయ్యాయి. 29 రోజుల విరామం తర్వాత దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర బుధవారం 26 పైసలు పెరిగి.. రూ.83.97 వద్దకు చేరింది. 2018 అక్టోబర్ 4న పెట్రోల్ ధర లీటర్ రూ.84 వద్దకు చేరి జీవనకాల రికార్డ్ స్థాయిని తాకింది.
దిల్లీలో డీజిల్ ధర కూడా బుధవారం లీటర్‌పై 25 పైసలు పెరిగి.. రూ.74.12 వద్దకు చేరింది.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్ ధర లీటర్‌కు 25 పైసల నుంచి 29 పైసల మధ్య పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 26 పైసల నుంచి 30 పైసల వరకూ పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రధన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్‌కు)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.87.31 | రూ.80.86 |
బెంగళూరు | రూ.86.76 | రూ.78.56 |
ముంబయి | రూ.90.57 | రూ.80.76 |
చెన్నై | రూ.86.73 | రూ.79.44 |
కోల్‌కతా | రూ.85.42 | రూ.77.68 |
ధరలు పెరగడానికి కారణాలు..
కరోనా వైరస్ విజృంభణతో గత ఏడాది భారీగా పడిపోయిన ఇంధన డిమాండ్.. వ్యాక్సిన్ వార్తలతో మళ్లీ పెరుగుతోంది. బ్రెంట్ బ్యారెల్‌కు 53.86 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. డబ్ల్యూటీఐ బ్యారెల్‌కు 50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పెరిగిన ముడి చమురు ధరల ఆధారంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరల్లో సవరణలలు చేశాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు.
ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్(ఒపెక్) మంగళవారం సమావేశమయ్యాయి. ఇందులో ఫిబ్రవరి నెలకు సంబంధించి చమురు ఉత్పత్తి సర్దుబాటు అంశంపై నిర్ణయం తీసుకున్నాయి. దేశీయంగా బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేందుకు ఈ అంశాలు ప్రధానంగా కారణమయ్యాయి.
ఇదీ చూడండి:'భారత ఆర్థిక వృద్ధిలో 9.6 శాతం క్షీణత'