దేశంలో పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా ఏడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. మొత్తం మీద ఈ ఒక్క నెలలోనే.. ధరలు పెరగటం ఇది తొమ్మిదోసారి. దిల్లీ పెట్రోలుపై లీటరుకు 26 పైసలు, డీజిల్‌పై లీటరుకు 29 పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.
దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 88.99, డీజిల్ లీటరు రూ. 79.35కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు 25 పైసలు పెరిగి రూ. 95.44కు చేరింది. డీజిల్‌పై 31 పైసలు పెరిగి రూ.86.33కు చేరింది.
హైదరాబాద్‌లో..
హైదబారాద్‌లో లీటరు డీజిల్‌పై 31 పైసలు పెరిగి రూ.86.53కు, లీటరు పెట్రోల్‌పై 27 పైసల పెరుగుదలతో రూ. 92.51కి ఎగబాకింది.