ETV Bharat / business

పెట్రో భారం నుంచి మరింత ఊరట- వ్యాట్​ కోతతో రాష్ట్రాల దీపావళి గిఫ్ట్ - ఉత్తరాఖండ్​లో పెట్రోల్ ధర ఎంత తగ్గింది?

పెట్రో భారం నుంచి కాస్త ఊరట కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చాలా రాష్ట్రాల్లో ధరలు దిగొస్తున్నాయి. ముఖ్యంగా అరడజనుకు పైగా ఉన్న భాజపా పాలిత రాష్ట్రాలు చమురుపై వ్యాట్​ను భారీగా తగ్గించాయి. తమ నిర్ణయంతో సామాన్యులకు లాభం చేకూరనున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్​పై ఏ రాష్ట్రం ఎంత వ్యాట్ తగ్గించిందంటే...

fuel prices
పెట్రోల్ ధరలు
author img

By

Published : Nov 4, 2021, 6:17 PM IST

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ ప్రకటించిన కేంద్రం.. రాష్ట్రాలనూ వ్యాట్ తగ్గించాలని కోరింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్రం తగ్గించగా.. రాష్ట్రాలు సైతం భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ను(ప్రతి లీటరుకు) రూ.12 మేర తగ్గించింది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ.. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశంలోని వివిధ రాష్ట్రాలు విలువ ఆధారిత పన్నును లీటరుకు ఏమేర తగ్గించాయో తెలిపే పట్టికను ఓసారి చూడండి..

రాష్ట్రంపెట్రోల్డీజిల్
ఉత్తర్​ప్రదేశ్రూ.12 రూ.12
త్రిపుర రూ.7రూ.7
సిక్కిం రూ.7రూ.7
కర్ణాటకరూ.7రూ.7
హరియాణారూ.7రూ.7
గోవా రూ.7రూ.7
హిమాచల్​ ప్రదేశ్రూ.7రూ.7
మిజోరంరూ.7రూ.7
పుదుచ్చేరి రూ.7 రూ.7
అసోంరూ.7రూ.7
గుజరాత్రూ.7రూ.7
మణిపుర్రూ.7రూ.7
అరుణాచల్​ ప్రదేశ్​రూ.5రూ.5
గోవారూ.5.47రూ.4.38
రాజస్థాన్‌రూ.6.35----
ఒడిశా----రూ.12.88
ఉత్తరాఖండ్రూ.2---
దిల్లీరూ.1రూ.1.75

కేరళలో స్వల్పంగానే..

కేంద్రం తగ్గింపునకు అదనంగా పెట్రోల్​పై రూ.1.5, డీజిల్​పై 2.5 మేర కేరళలో ధరలు దిగొచ్చాయి. చమురు ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్రం నిర్ణయాన్ని.. కేవలం కంటితుడుపు చర్యగా విజయన్ సర్కార్ అభివర్ణించింది. కరోనా వల్ల తలెత్తిన సంక్షోభంతో రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడిందని.. ఈ నేపథ్యంలో కేంద్రం మాదిరే ధరలను తగ్గించలేమని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.