ETV Bharat / business

పెన్షనర్లు లైఫ్​ సర్టిఫికెట్ పొందటం ఇక ఈజీ - లైఫ్ సర్టిఫికెట్ ఎవరికి అవసరం

పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు జీవన్​ ప్రమాణ్​ సేవలను ఇకపై పోస్టాఫీసుల్లోనూ పొందొచ్చు. వారందరికీ సమీపంలో ఉన్న పోస్టాఫీసుల్లో ఈ సేవలను పొందేలా వీలు కల్పిస్తున్నట్లు 'ఇండియా పోస్ట్​' అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Life Certificate can issued by Post offices
పోస్టాఫిసుల్లో లైఫ్​ సర్టిఫికెట్​
author img

By

Published : Jul 21, 2021, 5:52 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు 'ఇండియా పోస్ట్' గుడ్​ న్యూస్​ చెప్పింది. పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు తమ సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా జీవన్​ ప్రమాణ్​ సేవలు పొందొచ్చని వెల్లడించింది. ముఖ్యంగా లైఫ్​ సర్టిఫికెట్​ను సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా సులభంగా పొందొచ్చని తెలిపింది.

టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వృద్ధులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. ఇప్పటి వరకు లైఫ్​ సర్టిఫికెట్ పొందేందుకు పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకులకు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే తాము పని చేసిన సంస్థ కార్యాలయానికి వెళ్లి లైఫ్​ సర్టిఫికెట్​ పొందాల్సి వచ్చేది.

ఇప్పుడు ఇండియా పోస్ట్ లైఫ్​ సర్టిఫికెట్​ అందించే సేవలు ప్రారంభించడం వల్ల 60 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. భారీ సంఖ్యలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత పెన్షనర్లకు ఊరట లభించనుంది.

ఏమిటీ లైఫ్​ సర్టిపికెట్​..?

పెన్షన్​దారుడు జీవించి ఉన్నారని తెలిపేందుకు ఉద్దేశించినదే ఈ లైఫ్​ సర్టిఫికెట్​. ఇది బయోమెట్రిక్​తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఆధార్, బయోమెట్రిక్​ను ఉపయోగించి దీనిని పొందవచ్చు.

కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఉద్యోగ విరమణ అయిన అనంతరం పెన్షన్​ పొందేందుకు ఖాతా ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ జీవన ప్రమాణ పత్రాన్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.

ఏ వివరాలు అవసరం?

ఆధార్ సంఖ్య, పేరు, మొబైల్ నంబరు, ఫించను సంబంధిత సమాచారంపై సెల్ఫ్ డిక్లరేషన్ (పీపీఓ నంబర్ తరహా), పెన్షన్​ ఖాతా నంబరు, బ్యాంక్ ఖాతా సమాచారం, పెన్షన్​ మంజూరు సంస్థ పేరు, పింఛను పంపిణీ చేసే సంస్థ తదితర వివరాలు అవసరం అవుతాయి. అంతేకాకుండా బయోమెట్రిక్స్(వేలిముద్ర లేదా ఐరిస్) అందించాల్సి ఉంటుంది.

వ్యాలిడిటీ ఎన్ని రోజులు?

జీవన ప్రమాణ పత్రం తీసుకున్న సమయంలో పెన్షన్​ ముంజూరు చేసే సంస్థ నియమనిబంధనలపై వ్యాలిడిటీ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జీవన ప్రమాణ పత్రం వ్యాలిడిటీ సంవత్సరం ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయిన అనంతరం మరో జీవన ప్రమాణ పత్రం పొందాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.