ETV Bharat / business

Paytm IPO: నేటి నుంచి పేటీఎం ఐపీఓ

భారీస్థాయిలో నిధుల సమీకరణ లక్ష్యంతో పేటీఎం(Paytm IPO)మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ నవంబరు 8న(Paytm IPO date) ప్రారంభం కానుంది. ఈనెల 10న ముగియనుంది.

Paytm IPO
పేటీఎం ఐపీఓ
author img

By

Published : Nov 8, 2021, 7:14 AM IST

Updated : Nov 8, 2021, 11:29 AM IST

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ రూ.18,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు(Paytm IPO) వస్తోంది. ఇందులో రూ.8300 కోట్ల కోసం తాజాగా షేర్లు జారీ చేస్తున్నారు. ఈ నిధులు మాత్రమే కంపెనీకి వెళ్తాయి. ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.10,000 కోట్ల విలువైన షేర్లు విక్రయిస్తున్నారు. ఇవి వారికి చెందుతాయి. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఇప్పటికే రూ.8235 కోట్లు సమీకరించింది.

ఈనెల 8న(Paytm IPO date) ప్రారంభమై, 10న ముగియనున్న ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.2080-2150గా నిర్ణయించారు. మొత్తం ఇష్యూలో 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయిస్తారు. రిటైలర్లు కనీసం 6 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇష్యూ గరిష్ఠధర ప్రకారం చూస్తే ఇందుకు రూ.12,900 అవుతుంది. గరిష్ఠంగా ఒకరు 15 లాట్లకు దరఖాస్తు చేయొచ్చు. అంటే రూ.1,93,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దేశీయంగా ఇదే అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూ.

ఇదీ చూడండి: Meta Facebook: పేరుమార్పిడి వివాదంలో ఫేస్‌బుక్‌..!

Last Updated : Nov 8, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.