ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వారికి క్యాష్‌బ్యాక్‌లతో పాటు రివార్డు పాయింట్లు, ఇతర ప్రయోజనాలను ప్రకటించింది.
- తొలిసారి పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే యూజర్ల కోసం '3 పే 2700 క్యాష్‌బ్యాక్' పేరిట పేటీఎం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. వీరు గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక్కో నెల గరిష్ఠంగా రూ.900 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలా వరుసగా మూడు నెలల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే మొత్తం రూ.2,700 వరకు లబ్ధి పొందవచ్చు.
- పాత యూజర్ల కోసం సైతం పేటీఎం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. వీరు చేసే ప్రతి గ్యాస్ బుకింగ్‌కు 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్లు పొందవచ్చు. వీటిని ఇతర సేవల కొనుగోలులో వినియోగించుకోవచ్చు.
- ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
- అలాగే కస్టమర్లు తమ గ్యాస్ బిల్లును వచ్చే నెల చెల్లించే సదుపాయాన్ని కూడా పేటీఎం కల్పిస్తోంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌లో భాగంగా 'పేటీఎం నౌ పే లేటర్' ప్రోగ్రాం కింద ఈ ఆఫర్‌ను అందిస్తోంది.
- ఈ ఆఫర్లు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందిస్తున్నారు. ఆగస్టు 31లోగా తొలి గ్యాస్ బుక్ చేసుకొని ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత అక్టోబర్ 21 వరకు ప్రతి నెల చేసే తొలి సిలిండర్ బుకింగ్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబరు 31 వరకు చెల్లింపు చేసి స్క్రాచ్‌కార్డు పొందవచ్చు.
- క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డు రూపంలో వస్తుంది. దీని కాలపరిమితి 7 రోజులు మాత్రమే. కార్డును స్క్రాచ్ చేసిన 72 గంటల్లో డబ్బులు పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతాయి.
ఇదీ చదవండి : వెబ్ కెమెరా లేకుండానే టీవీలో వీడియోకాల్స్!