2020-21 ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలకు కరోనా వైరస్ బ్రేకులు వేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020-21 ఏడాదిలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2.24 శాతం తగ్గినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య(సియామ్) తెలిపింది. 2019-20లో 27లక్షల 73వేల 519 వాహన విక్రయాలు జరగ్గా.. 2020-21లో ఆ సంఖ్య 27లక్షల 11వేల 457కు పరిమితమైందని వెల్లడించింది. ద్విచక్ర వాహన విక్రయాల్లో ఏకంగా 13.19 శాతం తగ్గుదల కనిపించింది.
2019-20లో కోటి 74లక్షల 16వేల 432 ద్విచక్ర వాహనాలు కంపెనీల నుంచి డీలర్లకు చేరగా 2020-21లో ఆ మొత్తం కోటి 51లక్షల 19వేల 387గా ఉన్నట్లు సియామ్ వివరించింది. వాణిజ్య వాహన విక్రయాల్లోనూ 20.77 శాతం మేర తగ్గుదల కనిపించింది.
2019-20లో 7లక్షల 17వేల 593 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2020-21లో 5లక్షల 68వేల 559 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో 66.06 శాతం, అన్ని కేటగిరీల్లో వాహన విక్రయాలు 13.6 శాతం మేర తగ్గాయని సియామ్ పేర్కొంది. కరోనాకు ముందు కూడా వాహన రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు గుర్తుచేసింది.
ప్యాసింజర్ వాహన విక్రయాలు
2019-20 | 27, 73, 519 |
2020-21 | 27, 11, 457 |
తగ్గుదల | 2.24% |
ద్విచక్ర వాహన విక్రయాలు
2019-20 | 1, 74, 16, 432 |
2020-21 | 1, 51, 19, 387 |
తగ్గుదల | 13.19% |
వాణిజ్య వాహన విక్రయాలు
2019-20 | 7, 17, 593 |
2020-21 | 5, 68, 559 |
తగ్గుదల | 20.77% |
త్రిచక్ర వాహన విక్రయాలు
తగ్గుదల | 66.06% |
అన్ని కేటగిరీల్లో వాహన విక్రయాలు
తగ్గుదల | 13.60% |
ఇదీ చూడండి: కొత్త ఏడాదిలో జోరుగా వాహన విక్రయాలు