ఆగస్టులో ప్యాసింజర్ వాహనాల (Auto monthly sales data) రిటైల్ విక్రయాల్లో 39 శాతం వృద్ధి నమోదైనట్లు 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా)' (FADA sales data) వెల్లడించింది. 2020 ఆగస్టులో 1,82,651 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఆగస్టులో అవి 2,53,363కి పెరిగాయి.
ద్విచక్రవాహనాల విక్రయాలు 2020, ఆగస్టులో 9,15,126 అమ్ముడయ్యాయి. ఈసారి అవి 7 శాతం పెరిగి 9,76,051 యూనిట్లకు పెరిగాయి.
వాణిజ్య వాహన విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. 2019 ఆగస్టులో 26,851 వాహనాలు విక్రయమవగా.. ఈసారి అవి 97 శాతం పెరిగి 53,150 యూనిట్లకు చేరుకున్నాయి.
త్రీవీలర్ విక్రయాలు కూడా 80 శాతం పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాల్లో 35.49 శాతం వృద్ధి నమోదైంది.
స్థూలంగా అన్ని విభాగాల్లో కలిపి ఆగస్టులో వాహన విక్రయాలు 14 శాతం పెరిగాయి. 2019, ఆగస్టులో 12,09,550 యూనిట్లు విక్రయించగా.. ఈ ఆగస్టులో ఆ సంఖ్య 13,84,711కు ఎగబాకింది.
ఇదీ చదవండి: reliance jio: జియో డేటా విప్లవానికి 5 ఏళ్లు- టెక్ కంపెనీల అభినందనలు