ETV Bharat / business

విమాన ఛార్జీలపై స్థాయీ సంఘం కీలక సిఫార్సులు - ఏవియేషన్‌ ఛార్జీలు

విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు తగ్గినా, విమానసేవల నిర్వాహకులు ఆ ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదిలీ చేయడంలేదని టీజీ వెంకటేశ్‌ నేతృత్వంలోని రవాణా, పర్యాటక విభాగాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆక్షేపించింది. దేశ పౌరవిమానయాన రంగ పరిస్థితులపై ఈ కమిటీ అధ్యయనం చేపట్టి, పార్లమెంటుకు శుక్రవారం నివేదిక సమర్పించింది. ఎకానమి తరగతి విమాన ఛార్జీలకు పరిమితులు విధించాలని సిఫార్సు చేసింది.

flight charges in india
విమాన ఛార్జీలు
author img

By

Published : Jul 24, 2021, 7:02 AM IST

ఎకానమి తరగతి విమాన ఛార్జీలకు పరిమితులు విధించాలని టీజీ వెంకటేశ్‌ నేతృత్వంలోని రవాణా, పర్యాటక, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. దేశ పౌరవిమానయాన రంగ పరిస్థితులపై ఈ కమిటీ అధ్యయనం చేపట్టి, పార్లమెంటుకు శుక్రవారం నివేదిక సమర్పించింది. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు తగ్గినా, విమానసేవల నిర్వాహకులు ఆ ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదిలీ చేయడంలేదని కమిటీ ఆక్షేపించింది. ఛార్జీలను తగ్గించడం ద్వారా ఏటీఎఫ్‌ ధరల తగ్గుదల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీచేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.

విమానయాన సంస్థలు వసూలు చేసే టికెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జీల్లో ఏకరూపకత లేదని కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టికెట్టు రద్దు రుసుమును హేతుబద్ధీకరించాలని, ప్రయాణికుల నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తాన్ని వసూలు చేయొచ్చో నిర్దేశించాలని కోరింది. టికెట్‌ బేస్‌ ఫేర్‌లో సగానికి మించి రద్దు ఛార్జీ ఉండకూడదని పార్లమెంటుకు ఇదివరకు సమర్పించిన నివేదికల్లో సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. టికెట్లు రద్దుచేసుకున్న ప్రయాణికుల నుంచి వసూలుచేసిన పన్నులు, ఇంధన, సర్‌ఛార్జీలను వెనక్కు ఇచ్చేయాలని పేర్కొంది. కేంద్ర ప్రభ్వుత్వం ఈ విషయమై విమానయాన సంస్థలతో మాట్లాడి ఒప్పించాలని సిఫార్సు చేసింది.

ఇంకా ఏం చెప్పిందంటే...

  • విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం అన్ని విమానాశ్రయాల్లో ప్రత్యేక స్థలం కేటాయించాలి. ఇలాంటి సమయాల్లో వారికి ఆహారం, నీరు, వైద్య సౌకర్యాలు, వసతి ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
  • కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న పౌరవిమానయాన రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం దీర్ఘకాల చర్యలు చేపట్టాలి. ఏవియేషన్‌ ఛార్జీలను తాత్కాలికంగా నిలిపేయాలి. ఈ రంగానికి సంబంధించిన అన్ని వ్యాపారాలనూ ప్రాధాన్య రంగాలుగా గుర్తించి, రుణాలు అందించాలి. పౌర విమానయానశాఖ ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి, ఎయిర్‌లైన్‌ పరిశ్రమకు నిర్మాణాత్మకంగా రుణం అందించాలి.
  • రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ తగ్గింపు వంటి చర్యల ద్వారా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, ఎయిర్‌ లైన్స్‌కి వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ అందించేందుకు ప్రయత్నించాలి. సెక్యూరిటీ, అగ్నిమాపకం వంటి సేవలను ఉచితంగా అందించడం ద్వారా విమానాశ్రయానిర్వాహకులకు ఆర్థికేతర ప్రోత్సాహం అందించాలి. వైమానిక అనుసంధానం పెంపుతో ఊపందుకొనే ఆర్థిక కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ముఖ్యంగా పర్యాటకం, వైద్య రంగాలకు ప్రాధాన్యమివ్వాలి.
  • ప్రాంతీయ విమానాశ్రయాలను 'ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా' సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. నాన్‌ ఫ్రిల్‌ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకున్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేయాలి.
  • 'కృషి ఉడాన్‌' పథకం రైతులకు మేలుచేస్తుంది కాబట్టి.. ఈ విమానాలకు ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
    విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌ హాలింగ్‌ (ఎంఆర్‌ఓ)కి ప్రాధాన్యమివ్వాలి. అన్నిమెట్రో నగరాల్లో ఎంఆర్‌ఓ వర్క్‌షాపుల ఏర్పాటుకు పౌర విమానయానశాఖ చర్యలు తీసుకోవాలి.
  • దేశంలో పైలెట్లకు ఉన్న కొరతను దృష్టిలో ఉంచుకొని కొత్తగా పైలెట్‌ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు, ప్రస్తుతమున్న సంస్థల్లో ఎక్కువమంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలి.

ఇదీ చూడండి: కరోనాతో ఇబ్బందులెదురైనా.. క్యూ1లో రిలయన్స్​ జోష్​

ఇదీ చూడండి: కొత్త పోర్టల్ ద్వారా ఐటీ రిటర్నుల దాఖలు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.