ETV Bharat / business

వలస కూలీలకూ ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ సౌకర్యం! - parliamentary panel on labour latest news

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారికి మెరుగైన సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ ప్రయోజనాలను వారికి అందేలా ఆయా పథకాలను విస్తరించాలని యోచిస్తోంది కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్​.

Par panel favours extending ESI, EPF benefits to migrant workers
వలస కార్మికులకూ ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ సౌకర్యం!
author img

By

Published : Jul 12, 2020, 9:59 PM IST

కరోనా సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన అంసంఘటిత కార్మికులు, వలస కూలీలకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ ప్రయోజనాలు పొందేందుకు ఉన్న కనీస ఉద్యోగుల సంఖ్య, వేతనాల పరిమితిని తొలగించాలనే యోచనలో ఉంది కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్​. లాక్​డౌన్​ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వలస కార్మికులకు ఈ పథకాన్ని వర్తించేలా విస్తరించాలని ప్యానెల్​ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ పథకాల విస్తరణ అంశంలో కీలక విషయాలు వెల్లడించారు ప్యానెల్​ చీఫ్​, బీజేడీ ఎంపీ భర్​త్రుహరి మహ్​తాబ్​.

" లాక్​డౌన్​ తర్వాత అసంఘటిత కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించాలని ప్యానెల్​ సభ్యులు భావిస్తున్నారు. ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ ప్రయోజనాన్ని పొందేందుకు ఉన్న కనీస ఉద్యోగులు, వేతనాల పరిమితిని తొలగించి.. వలస కార్మికులకు వర్తించేలా ఈ రెండు పథకాలను విస్తరించాలని ప్యానెల్​లోని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించటమే ముఖ్య ఉద్దేశం."

- భర్​త్రుహరి మహ్​తాబ్​, ప్యానెల్​ చీఫ్, బీజేడీ ఎంపీ​

జులై 15న భేటీ..

కొవిడ్​-19 సంక్షోభంలో వలస కార్మికులకు సంబంధించిన సమస్యలపై వచ్చే బుధవారం (జులై 15న) ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనుంది పార్లమెంటరీ ప్యానెల్​. వలస కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్యానెల్​ సభ్యులు ఉన్నందున ఈ భేటీలో ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఈఎస్​ఐ, ఈపీఎఫ్​..

ఎంప్లాయీస్​ స్టేట్​ ఇన్సూరెన్స్​ (ఈఎస్​ఐ), ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​ ఫండ్​ (ఈపీఎఫ్​).. ఉద్యోగుల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు.

ఈఎస్​ఐలో ఉద్యోగులు తమ జీతంలో 1.75 శాతం, యాజమాన్యాలు 4.75 శాతం చెల్లించినట్లయితే.. ఉద్యోగులు నెలకు రూ. 21,000 వరకు పొందే అవకాశం ఉంటుంది. కనీసం 10 మంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈఎస్​ఐ వర్తింపజేస్తారు.

అలాగే.. ఈపీఎఫ్​ 20 మంది అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు వర్తిస్తుంది. ఇందులో ఉద్యోగులు, యాజమాన్యం సమానంగా వేతనంలో 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.