ETV Bharat / business

'ఆధార్​ ఉంటే పాన్​ కార్డ్ ఆటోమేటిక్​గా వచ్చేస్తుంది' - ఆధార్ కార్డు

పన్ను చెల్లింపులకు ఇకనుంచి ఆధార్​ కార్డు కీలకం కానుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన నిబంధనల ప్రకారం ఆధార్​తో ఐటీ రిటర్ను దాఖలు చేసిన వారికి సుమోటోగా పాన్​ దరఖాస్తు స్వీకరిస్తారు.

ఆధార్
author img

By

Published : Sep 2, 2019, 4:36 PM IST

Updated : Sep 29, 2019, 4:32 AM IST

పన్ను చెల్లింపుల సమయంలో ఇక నుంచి ఆధార్​ కార్డు వివరాలను పొందుపరిస్తే సరిపోతుంది. ఆధార్​ కార్డుతో అనుసంధానమైన పాన్​ కార్డు వివరాలను ఆదాయపు పన్ను శాఖ తనంతట తానే సేకరిస్తుంది. ఈ విధానం సెప్టెంబర్​ 1 నుంచి అమలవుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (సీబీడీటీ) తెలిపింది.

ఐటీ చట్టంలోని 139 ఏఏ(2) ప్రకారం 2017 జులై 1 లోపు పాన్​ కార్డు ఉన్న వ్యక్తి ఆధార్​ పొందేందుకు అర్హుడు. ఆధార్​ వచ్చాక ఆ వివరాలను ఐటీ శాఖతో పంచుకోవాలి. ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఆధార్​ కార్డు అనుసంధానం రాజ్యాంగబద్ధంగా అంగీకారమేనని, అందుకు బయోమెట్రిక్​ ఐడీ తప్పనిసరని గతేడాది సెప్టెంబర్​లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు కొత్త విధానాన్ని ప్రకటించింది సీబీడీటీ.

"ఎవరైనా పాన్​ కార్డు లేకుండా కేవలం ఆధార్​ కార్డుతోనే ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే.. వారికి సుమోటోగా పాన్​ కార్డు దరఖాస్తు వచ్చేస్తుంది. అంటే వాళ్లకు ఆధార్​ ఉంటే మేం పాన్​ కార్డు ఇస్తాం. పాన్​, ఆధార్​ అనుసంధానం తప్పనిసరి."

-పీసీ మోదీ, సీబీడీటీ ఛైర్మన్​

పాన్​, ఆధార్​ పొందేందుకు పౌరులు సమర్పించాల్సిన వివరాలు ఒకటే కావటం వల్ల ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఉంటుందని బడ్జెట్​ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ ప్రకటించారు. ఒకదాని స్థానంలో మరొకటి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని స్పష్టంచేశారు.

ఆధార్​, పాన్​ అనుసంధానం చేసుకోవాలని ఇప్పటికే ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్​ 30తో ఆ గడువు పూర్తి కానుంది. 120 కోట్ల మందికి ఆధార్​ కార్డులు ఉండగా... 41 కోట్ల మందికి పాన్​ కార్డులు ఉన్నాయి. ఇందులో అనుసంధానమైనవి 22 కోట్లు మాత్రమేనని సీబీడీటీ వెల్లడించింది.

ఇదీ చూడండి: పాన్​​ కార్డు అనుసంధానానికి గడువు పెంపు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various locations and dates
Moscow, Russia. 29th June 2018.
1. 00:00 Various of Javier 'Chicharito' Hernandez
Sochi, Russia. 27th June 2017.
2. 00:15 Javier Hernandez
Sochi, Russia. 28th June, 2017.
3. 00:29 Javier Hernandez during training
Spartak Stadium, Moscow, Russia. 1st July, 2017
4. 00:43 Javier Hernandez warming up
SOURCE: SNTV
DURATION: 00:48
STORYLINE:
Former striker Javier Hernandez joined Sevilla from West Ham United.
Hernandez left West Ham for Spain, with Hammers co-owner David Gold confirming the news on social media.
The official club social channel announced that the Mexican forward had moved to Sevilla on a permanent basis.
Last Updated : Sep 29, 2019, 4:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.