ETV Bharat / business

ఆరోగ్య భారతం నిర్మాణానికి అదనపు నిధులు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో విడత ప్యాకేజీలో వైద్య రంగానికి పలు ఉద్దీపనలు ప్రకటించారు. భవిష్యత్తులో ఎలాంటి అంటు వ్యాధులు వచ్చినా భారత్‌ ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పెట్టుబడులను పెంచనున్నట్లు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తామని, వైద్య రంగ పరిశోధనలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

package for health sector
వైద్య రంగానికి ఉద్దీపనలు
author img

By

Published : May 17, 2020, 12:39 PM IST

Updated : May 17, 2020, 12:54 PM IST

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో, ఆఖరి విడత ప్యాకేజీలో భాగంగా వైద్య రంగానికి పలు ఉద్దీపనలు ప్రకటించారు. భవిష్యత్​లో దేశంలో కరోనా లాంటి అంటువ్యాధులు ప్రబలినా... ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

అలాగే రానున్న రోజుల్లో ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పెట్టుబడులు పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాలోనూ సాంక్రమిక వ్యాధుల ప్రత్యేక విభాగం, మండల స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. భవిష్యత్​లో ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్య సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని తెలిపారు.

పరిశోధనలకు ఊతం

వైద్య రంగంలో పరిశోధనలకు గాను ఐసీఎమ్ఆర్​ ద్వారా అదనపు నిధులు, ప్రోత్సాహం అందిస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ ద్వారా ఆరోగ్య సేవలు మరింత విస్తృతం చేస్తామని ఆమె తెలిపారు.

ఆరోగ్య రంగం కోసం ఇవి చేశాం...

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేశారో వివరించారు నిర్మల.

  • వైద్య సదుపాయాల ఏర్పాటుకు తక్షణమే రూ.15 వేల కోట్లు విడుదల
  • రాష్ట్రాలకు రూ.4,113 కోట్లు వితరణ
  • కేంద్ర ప్రభుత్వం ద్వారా కరోనా టెస్టు కిట్లు, తదితర వైద్య సామగ్రి కోసం రూ.3,750 కోట్లు విడుదల
  • పరీక్షల ల్యాబ్​ల కోసం రూ.550 విడుదల
  • ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న 50 లక్షల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్​ యోజన కింద బీమా సౌకర్యం
  • వైద్య సిబ్బంది రక్షణ కోసం అంటువ్యాధుల నియంత్రణ చట్టంలో సవరణలు

స్వయం సమృద్ధి సాధించాం...

పీపీఈ కిట్ల విషయంలో కేవలం 2 నెలల్లోనే భారత్ స్వయం సమృద్ధి సాధించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇప్పటికే 51 లక్షల పీపీఈ కిట్లను, 87 లక్షల ఎన్​-95 మాస్కులను రాష్ట్రాలకు పంపించినట్లు స్పష్టం చేశారు. 11 కోట్లకుపైగా హైడ్రాక్సీ క్లోరిక్విన్ మాత్రలను రాష్ట్రాలకు అందించినట్లు ఆమె వెల్లడించారు.

ఇదీ చూడండి: ప్యాకేజ్ 5.0: సంక్షేమమే లక్ష్యంగా సంస్కరణలు

Last Updated : May 17, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.