ETV Bharat / business

ఆ ఒక్క 'ఐపీఓ' కోసమే.. కొత్తగా కోటి డీమ్యాట్​ ఖాతాలు! - లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్

LIC IPO: ఎల్​ఐసీ ఐపీఓ ప్రతిపాదన తర్వాత కొత్తగా కోటి డీమ్యాట్​ ఖాతాలు తెరుచుకున్నాయని ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్​కాంత పాండే పేర్కొన్నారు. మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ నిర్వహించాలన్నది తమ లక్ష్యం అని తెలిపారు.

lic ipo
ఎల్​ఐసీ ఐపీఓ
author img

By

Published : Mar 5, 2022, 6:54 AM IST

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ ఎప్పుడు జరపాలనే అంశంపై, 'మదుపర్ల అత్యుత్తమ ప్రయోజనాల'ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. 'ఎల్‌ఐపీ ఐపీఓ ప్రతిపాదన అనంతరం కోటి కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరచుకున్నాయంటే, ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది. ఇపుడు మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 8 కోట్లకు పైగా చేరింది. మార్కెట్‌కు కొత్త శక్తి వచ్చింది' అని ఆయన అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఇష్యూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా, అనుకోకుండా వచ్చిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల వల్ల మార్కెట్లలో తలెత్తిన పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. 'ఎల్‌ఐసీ అనేది వ్యూహాత్మక పెట్టుబడి ఏమీ కాదు. అయితే అది చాలా ముఖ్యమైనది' అని ఆయన అన్నారు. వృత్తిపరమైన సలహాదారులు ఈ ఐపీఓ విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారని వివరించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.60,000 కోట్లు సమీకరించి, 2021-22 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యమైన రూ.78,000 కోట్లను సాధించాలని కేంద్రం భావిస్తోంది. సంస్థకు, మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ నిర్వహించాలన్నది తమ లక్ష్యంగా వివరించారు.

ఇదీ చూడండి: మీ ఫోన్​లో డేటా అయిపోయిందా..? నో టెన్షన్​ 'ఎమర్జెన్సీ డేటా' ఉందిగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.