ETV Bharat / business

ఇక రోజంతా ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ

ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ చేసే పద్ధతిని 24 గంటలూ అమలు చేయనున్నట్లు ఎస్​బీఐ ప్రకటించింది. దీని ప్రకారం.. రూ.10 వేలు అంతకుమించి నగదు విత్​డ్రా చేయాలంటే రిజిస్టర్​ మొబైల్​కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది.

OTP WITHDRAWALS
ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ
author img

By

Published : Sep 17, 2020, 5:11 AM IST

ఓటీపీ ఆధారంగా రూ.10వేలు, అంతకుమించి నగదు ఉపసంహరణ చేసే పద్ధతిని రోజంతా అమలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం సెప్టెంబర్‌ 18 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

దీని ప్రకారం.. డెబిట్‌కార్డు కలిగినవారు ఏటీఎంకు వెళ్లి, రూ.10,000, అంతకు మించి ఉపసంహరించాలంటే, రిజిస్టర్‌ మొబైల్‌కు వచ్చే ఓటీపీ కూడా నమోదు చేయాల్సి ఉంది. అంటే డెబిట్‌ కార్డుతో పాటు బ్యాంకు వద్ద నమోదైన మొబైల్‌ కలిగి ఉంటేనే నగదు ఉపసంహరించే వీలుంటోంది.

ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని కల్పించినప్పటి నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అమలవుతోంది.

సురక్షితంగా..

ఖాతాదారులు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణల విషయంలో మరింత సురక్షితంగా ఉండేందుకు ఇది ఉపయోగ పడుతుందని ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంకింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఎస్బీఐ బ్యాంకు చోరీకి దుండగులు విఫలయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.