ETV Bharat / business

కరోనా దెబ్బతో ఉద్యోగాల కోతకు సంస్థలు రెడీ! - ఆస్పత్రులపై కరోనా వైరస్​ ప్రభావం

కరోనా లాక్​డౌన్​తో ​ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ దెబ్బకు కుదేలైన పలు ప్రైవేటు రంగ సంస్థలు తమ సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఇప్పటికే పలు సంస్థలు ఈ మేరకు చర్యలు మొదలుపెట్టగా.. మరికొన్ని కంపెనీలు అదే బాటలో అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలిపింది.

Organised pvt sector plans layoff, salary cut amid COVID-19 crisis: Report
కరోనా దెబ్బతో ఉద్యోగాల కోతకు సంస్థలు రెడీ!
author img

By

Published : May 14, 2020, 7:06 PM IST

కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. పలు ప్రైవేట్​ రంగ సంస్థలు కార్యకలాపాలు లేక కుదేలయ్యాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు తమ సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది.

'లే ఆఫ్​ సర్వే 2020' పేరుతో 68శాతం ఉద్యోగులను సర్వే చేసింది మైహైరింగ్​క్లబ్​ డాట్​ కామ్, సర్కారి నౌకరీ డాట్ ఇన్ఫో. ఈ నివేదిక ప్రకారం ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగాల కోత ప్రారంభించగా.. మరికొన్ని కంపెనీలూ ఇదే ఆలోచనలో ఉన్నట్లు తేలింది.

2020 మే 1 నుంచి మే 10 మధ్య కాలంలో ఆన్​లైన్​ సర్వే ద్వారా 25 నగరాల్లో 1,124 కంపెనీలను సర్వే చేశారు నిర్వహకులు.

సర్వేలోని ముఖ్యాంశాలు...

  • 73 శాతం సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించగా... 57 శాతం కంపెనీలు సిబ్బందిని తాత్కాలికంగా తొలగించే యోచనలో ఉన్నాయి. 21శాతం సంస్థలు ఉద్యోగులను రెండేళ్ల వరకు తొలగించనున్నాయి.
  • 32 శాతం సంస్థలు.. తమ ఉద్యోగులను తొలగించాలని అసలు ఆలోచించడం లేదు.
  • రిటైల్​, ఎఫ్​ఎంసీజీ రంగంలో అత్యధికంగా 48శాతం మంది ఉపాధి కోల్పోయారు. దీని తర్వాత ఆస్పత్రులు, విమాన, రవాణా రంగంతో కలిపి 48 శాతం, ఆటోమొబైల్​ తయారీ రంగం 41 శాతం, రియల్​ఎస్టేట్​ 39 శాతం, పవర్​ సెక్టార్​ 38 శాతం ఉద్యోగాలు కోల్పోయి .. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • 6 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారే 31శాతం ఉపాధి కోల్పోయారు. 11-15 ఏళ్లు అనుభవం ఉన్నవాళ్లు 30 శాతం, 15 ఏళ్లు అనుభవం దాటిన వాళ్లు 21 శాతం,1 నుంచి 5 ఏళ్లు అనుభవం గల జూనియర్​ ఉద్యోగులు 18 శాతం ఉపాధి కోల్పోయారు.

గరిష్ఠంగా ఆ సంస్థలే...

'వైరస్ సంక్షోభంతో రిటైల్​, ఆటోమొబైల్​, తయారీ, రవాణా,ఆస్పత్రులు, విమానాయాన పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి కోలుకోవడానికి సమయం పడుతుంది. జీతాల్లో కోత, ఉపాధి కోల్పోవడం వల్ల ఖర్చు తగ్గిపోయి... వ్యాపార రంగం పూర్తిగా దెబ్బతింద'ని నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వైద్యులు, సామాన్యులకు డబ్ల్యూహెచ్​ఓ 'యాప్​' సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.