ETV Bharat / business

'2022 నాటికి హై-స్పీడ్​ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం' - హై-స్పీడ్​ ఇంటర్నెట్

భారత్​లో 2022 నాటికి వేగవంతమైన ఇంటర్నెట్​ను అందించేందుకు వన్​వెబ్​ సంస్థ కృషి చేస్తోంది. శుక్రవారం 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రష్యా నుంచి ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలతో 2021 ఆఖరు నుంచి అంతర్జాతీయంగా ఇంటర్నెట్​ సేవలు అందించాలని భావిస్తోంది.

oneweb launched 36 satellites for fast internet, connectivity, airtel
36 ఉపగ్రహాలతో 2022 కల్లా హై-స్పీడ్​ ఇంటర్నెట్
author img

By

Published : Dec 19, 2020, 6:38 AM IST

2022 మధ్య నాటికి భారత్‌లో అత్యధిక వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను అందించాలని శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ వన్‌వెబ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను రష్యా నుంచి ప్రయోగించినట్లు సంస్థ తెలిపింది. దివాలా ప్రక్రియను ఎదుర్కొన్న ఈ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కంపెనీని ఇటీవలే సునీల్‌ భారతి మిత్తల్‌కు చెందిన భారతీ గ్రూపు, బ్రిటన్‌ ప్రభుత్వం సంయుక్తంగా కొనుగోలు చేశాయి. ఇది జరిగిన కొన్ని వారాలకే ఈ సంస్థ 36 ఉపగ్రహాలను ప్రయోగించడం గమనార్హం.

ఈ ఉపగ్రహాల ప్రయోగంతో.. 2021 ఆఖరు నుంచి యునైటెడ్‌ కింగ్‌డమ్‌, అలస్కా, ఉత్తర ఐరోపా, గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, కెనడాలతో మొదలుపెట్టి అంతర్జాతీయంగా వినియోగదారులకు సేవలు అందించే దిశగా వన్‌వెబ్‌ అడుగులు వేయనుంది. గ్లోబల్‌ ప్రయారిటీ స్పెక్ట్రమ్‌ హక్కులను పొందిన ఈ సంస్థ ఇప్పటికే నాలుగు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. వన్‌వెబ్‌ శాటిలైట్ల ద్వారా 2022 మధ్య కల్లా భారత్‌లో అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్‌ అందించాలని సంస్థ భావిస్తోంది.

ఇదీ చూడండి : ఇండో పసిఫిక్​లో శాంతి కోసం 'క్వాడ్'​ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.