ETV Bharat / business

కోటీశ్వ‌రులుగా మారాలంటే నెలకు ఎంత డిపాజిట్ చేయాలి? - పీపీఎఫ్ న్యూస్ టుడే

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. అధిక రాబ‌డితో పాటు పన్ను ఆదా చేసే పెట్టుబడి ఎంపికల్లో ఒకటి. ఆర్థిక‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తెలివిగా ఇందులో పెట్టుబడి పెడితే, నెలవారీ పెట్టుబడి విధానంతో 15 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత పీపీఎఫ్‌ ఖాతా పొడిగింపు సదుపాయాన్ని పొందడం ద్వారా కోటీశ్వ‌రులు కావొచ్చు..!

PPF
పీపీఎఫ్, డబ్బు ఆదా
author img

By

Published : Jul 11, 2021, 5:52 AM IST

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. అధిక రాబ‌డితో పాటు పన్ను ఆదా చేసే పెట్టుబడి ఎంపికల్లో ఒకటి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉండ‌దు. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. త్రైమాసికం ప్రాతిప‌దిక‌న ప‌న్ను రేట్ల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రిస్తుంది. కాబట్టి, భవిష్యత్తులో పీపీఎఫ్ వడ్డీ రేటు మారవచ్చు. కానీ తక్కువ రిస్క్ తీసుకోవాల‌నుకునేవారికి పీపీఎఫ్‌ అత్యంత అనుకూలమైన పెట్టుబ‌డిగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తెలివిగా ఇందులో పెట్టుబడి పెడితే, నెలవారీ పెట్టుబడి విధానంతో 15 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత పీపీఎఫ్‌ ఖాతా పొడిగింపు సదుపాయాన్ని పొందడం ద్వారా కోటీశ్వ‌రులు కావొచ్చు..!

పీపీఎఫ్ ఖాతా డిపాజిట్ నియమాలు

పీపీఎఫ్ ఖాతా నిబంధనల ప్రకారం.. సంవ‌త్స‌రానికి పీపీఎఫ్ ఖాతాలో గరిష్ఠంగా 12 డిపాజిట్లు చేయవచ్చు. కాబట్టి, తక్కువ రిస్క్ తీసుకునేవారు, ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబ‌డి చేయ‌లేనివారు నెల‌కొకసారి మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ మాదిరిగా వీలైనంత‌ డిపాజిట్ చేయ‌వ‌చ్చు. అయితే, ప్రతి నెల 5వ తేదీలోగా పీపీఎఫ్‌ ఖాతాలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తారు, దాంతో ఖాతాదారుడు ఆ నెల వడ్డీని పొందవచ్చు.

పీపీఎఫ్ ఖాతా పొడిగింపు నియమం

తక్కువ రిస్క్ తీసుకునేవారు పీపీఎఫ్ ఖాతా పొడిగింపు నియమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పీపీఎఫ్‌ ఖాతాకు 15ఏళ్లకు మెచ్యూరిటీ వ్యవధి ఉంది. కానీ ఖాతా ప్రారంభించిన 15వ సంవత్సరంలో పీపీఎఫ్ ఎక్స్‌టెన్షన్ ఫారమ్‌ని సమర్పించడం ద్వారా ఖాతాను పొడిగించవచ్చు. పెట్టుబడి ఎంపికతో వడ్డీని ఎంచుకోవచ్చు. ఇదేవిధంగా ఐదేళ్ల వ్య‌వ‌ధితో పొడిగించుకోవ‌చ్చు. కాబట్టి, పీపీఎఫ్‌తో మ‌రింత ప్ర‌యోజ‌నం పొందాల‌నుకుంటే మ‌రింత కాలం పొడిగించుకోవాలి.

పీపీఎఫ్ క్యాలిక్యులేట‌ర్

ప్రతి నెల 5వ తేదీ లోపు పెట్టుబడిదారుడు నెలకు రూ.9,000 పెట్టుబడి పెడతాడని అనుకుంటే.. సంవత్సరానికి రూ.1,08,000 అవుతుంది. ఈ విధంగా పీపీఎఫ్‌ ఖాతాలో 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారనుకుంటే, సగటు పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్న 7.1 శాతంతో లెక్కిస్తే అది 30 ఏళ్లకు రూ.1,11,24,656లు అవుతుంది. దీంతో మీరు సుల‌భంగా నెల‌కు త‌క్కువ మొత్తం పెట్టుబ‌డితో కోటీశ్వ‌రులు కావొచ్చు.

ఇదీ చదవండి:ల్యాప్​టాప్​ కొంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.