Ola Super App: ఓలా వచ్చే సంవత్సరం తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని సంస్థ సీఈఓ భావిశ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్ ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం, ఇటీవల కొన్ని కంపెనీల షేర్లు పేలవంగా నమోదైన నేపథ్యంలో ఆయన ఇలా పేర్కొనడం గమనార్హం.
వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణ సేవలు అందించేందుకు 'సూపర్ యాప్' రూపకల్పనను వేగవంతం చేసినట్లు ఓ వార్తా సంస్థకు అగర్వాల్ వెల్లడించారు. భవిష్యత్‌లో ఓలా విద్యుత్తు వాహన వ్యాపారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు చేసేందుకు యోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యుత్తు స్కూటర్ల డెలివరీలో జాప్యానికి సెమీకండక్టర్ల కొరతే కారణమన్నారు. డిసెంబరు 15 నుంచి మొదటి దశ సరఫరా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2023 కల్లా విద్యుత్తు కారును ఉత్పత్తి చేయాలని ఓలా భావిస్తోంది.
ఇదీ చూడండి: 'ఓలా ఎలక్ట్రిక్' రికార్డ్- 2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు