ETV Bharat / business

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ బుకింగ్స్ షురూ..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓలా ఎలక్ట్రిట్​ స్కూటర్​కు సంబంధించి అప్​డేట్​ రానే వచ్చింది. రూ. 499 చెల్లించి అడ్వాన్స్​ బుకింగ్​ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

Ola electric scooter
ఓలా స్కూటర్
author img

By

Published : Jul 16, 2021, 6:42 AM IST

దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తాము తీసుకువస్తున్న ఈ స్కూటర్​ను పొందడానికి రిజిస్ట్రేషన్​లను ప్రారంభిస్తునట్లు తెలిపింది. ఇందుకోసం వినియోగదారులు రూ.499లతో వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.

ఓలా నుంచి రానున్న ఈ స్కూటర్​ కోసం ఎదురు చూస్తున్న వారు తమ వెబ్​సైట్​ http://olaelectric.com లో లాగిన్​ అయ్యి వాహనాన్ని బుక్​ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వివరాలతో గురువారం ట్వీట్​ చేసింది.

"ఓ మలుపునకు ఇదే మొదటి రోజు. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఇప్పుడు కేవలం రూ. 499 చెల్లింది రిజర్వ్​ చేసుకోండి. ఇందుకుగానూ http://olaelectric.com లోకి లాగిన్​ అవ్వండి. మార్పునకు శ్రీకారం చుట్టండి. "

-ఓలా, ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ

ప్రస్తుతం చెల్లించిన మొత్తాన్ని వినియోగదారులకు మరలా వెనక్కి ఇస్తామని సంస్థ తెలిపింది. ఈ స్కూటర్ ధరను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. జులైలో సరికొత్త స్కూట‌ర్​ను అందుబాటులోకి తేనున్నట్లు ఓలా ప్రకటించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 400 న‌గ‌రాల్లో లక్ష ఛార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఛార్జింగ్ స్టేష‌న్లను దూర ప్రాంతాల్లో కాకుండా, షాపింగ్ మాల్స్‌, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, కెఫేల వంటి ప్ర‌దేశాల్లో ఏర్పాటు చేయ‌నున్నట్లు ఓలా వివరించింది.

ఓలా స్కూట‌ర్‌లో ఇన్‌స్టాలేష‌న్ అవ‌స‌రం లేని హోమ్ ఛార్జ‌ర్ కూడా ఉంటుందని తెలిపింది. ఈ ఛార్జర్​తో 18 నిమిషాల్లో 50 శాతానికి పైగా ఛార్జ్​​ చేయవచ్చని.. తద్వారా 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.

ఇవీ చూడండి:

ఓలా ఈ-స్కూటర్​ వచ్చేది ఎప్పుడంటే!

'అంతర్జాతీయ మార్కెట్లోకి ఓలా ఈ-స్కూటర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.