ETV Bharat / business

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ! త్వరలోనే రెండో విడత బుకింగ్​!! - ఓలా న్యూస్​

Ola Electric scooters: బుక్​ చేసుకున్న వారందరికీ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లను డెలివరీ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే వాటిని డిస్పాచ్ చేసినట్లు వెల్లడించింది. త్వరలోనే రెండో విడత బుకింగ్ ఓపెన్ చేస్తామని చెప్పింది.

ola-electric-scooters
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయ్
author img

By

Published : Dec 31, 2021, 4:14 PM IST

Updated : Dec 31, 2021, 4:24 PM IST

Ola Electric scooters: తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకున్న వారందరికీ త్వరలోనే వాటిని అందించనున్నట్లు ఓలా సంస్థ ప్రకటించింది. ఈ వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్ల సమీప డెలివరీ కేంద్రాలకు వాటిని డిస్పాచ్ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. అతి త్వరలోనే రెండో విడత బుకింగ్​ను కూడా ప్రారంభిస్తామని చెప్పింది. ఓలా ఛైర్మన్​, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్​ భవిశ్​ అగర్వాల్​ ఈ మేరకు వెల్లడించారు.

పర్యావరణ హిత ఎలక్ట్రిక్ స్కూటర్​ను తయారు చేస్తున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించింది ఓలా. ఎస్​ 1, ఎస్​ 1 ప్రో పేరుతో రెండు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. ధర రూ.99,999, రూ.1,29,999గా నిర్ణయించింది. కేవలం రూ.499తో అడ్వాన్స్​ బుకింగ్​​ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

అయితే ఈ వాహనాలను అక్టోటర్​లోనే డెలివరీ చేస్తామని ఓలా చెప్పినప్పటికీ కరోనా కారణంగా అది నవంబర్​కు వాయిదాపడింది. ఆ తర్వాత సెమీకండర్ల కొరత ఉందని ఈ-స్కూటర్లను డిసెంబర్​ రెండో వారంలో కస్టమర్లకు అందిస్తామని చెప్పింది. ఎట్టకేలకు వాటిని డిస్పాచ్ చేసింది.

ఈ-స్కూటర్ల ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ​ కూడా పూర్తయిందని, ఇది పూర్తిగా డిజిటలైజ్​ కావడం వల్ల డెలివరీ అనుకున్న సమయం కంటే ఆలస్యమైందని ఓలా పేర్కొంది.

స్కూటర్​ బుకింగ్​ను ఓలా సెప్టెంబర్​లో ప్రారంభించగా.. తొలి రోజు రూ.600కోట్లు విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని సంస్థ అప్పుడు వెల్లడించింది.

ఇవీ చదవండి: 'ఓలా ఎలక్ట్రిక్​' రికార్డ్- 2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు

'ఓలా' గ్రాండ్​ ఎంట్రీ- సెకనుకు 4 స్కూటర్ల అమ్మకం

ఓలా ఈ-స్కూటర్​ రిలీజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ!

Ola Electric scooter: అరుదైన ఫీచర్‌తో ఓలా స్కూటర్‌

Last Updated : Dec 31, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.