ETV Bharat / business

ట్రంప్​ ట్వీట్​తో చమురు ధరలకు రెక్కలు - రష్యా సౌదీ చమురు యుద్ధం

ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తి తగ్గించి.. ధరల స్థిరీకరణకు ఒపెక్​ దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్​ ఇందుకు కారణమైంది. ట్రంప్ ట్వీట్ చేసిన కాసేపటికే సౌదీ అరేబియా.. ఒపెక్ దేశాల సమావేశానికి పిలుపునివ్వడం గమనార్హం.

Oil rockets over 30% as Trump signals end to price war
ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు 30 శాతం వృద్ధి
author img

By

Published : Apr 2, 2020, 11:20 PM IST

ఇటీవలే రికార్డు స్థాయిలో పతనమైన ముడి చమురు ధరలు.. నేడు అంతే వేగంగా పుంజుకున్నాయి. ప్రస్తుత డిమాండుకు తగ్గట్లు చమురు ఉత్పత్తిని తగ్గించి.. మద్దతు ధర కల్పించేందుకు సౌదీ అరేబియా, రష్యాలు చర్చలు జరుపుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్​ చేశారు. ఈ ఒక్క ట్వీట్​తో అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

నార్త్​ సీలో బ్యారెల్​ ముడిచమురు ధర 30శాతం వృద్ధితో 36.29 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ కూడా 25.4శాతం మెరుగుపడి 27.39 డాలర్లకు పెరిగింది.

oil-rockets-over-30-percent-as-trump-signals-end-to-price-war
ట్రంప్​ ట్వీట్​

పెరిగింది కానీ...

ట్రంప్​ ట్వీట్​పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ అధికార ప్రతినిధి మాత్రం.. సౌదీ యువరాజుతో ఎలాంటి సంభాషణలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే దీని ప్రభావం చమురు ధరలపై పడే అవకాశముంది.

అనూహ్య నిర్ణయం..

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమైన సౌదీ అరేబియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒపెక్​ దేశాలు సహా చమురు ఉత్పత్తి దేశాలన్నింటితోనూ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. చమురు ధరల స్థిరీకరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

సౌదీ యువరాజు మహమ్మద్​బిన్ సల్మాన్​, ట్రంప్​ల మధ్య ఫోన్​ సంభాషణ జరిగిన కొద్ది సేపటికే.. సౌదీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అయితే.. ఒపెక్​ సహా 22 దేశాలతో ఇది వరకే సౌదీ చర్చలు జరిపినా ఎలాంటి ఒప్పందం మాత్రం కుదరలేదు. ఇందుకు రష్యా అవలంభించిన తీరే ప్రధాన కారణమని సౌదీ ఆరోపించింది.

18 ఏళ్ల కనిష్ఠం..

సౌదీ, రష్యాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చమురు ధరలు ఇటీవలే 18 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి.

ఇదీ చూడండి:ఏప్రిల్ 15 తర్వాత అంతర్జాతీయ విమానాలకు అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.