ETV Bharat / business

చమురు ధరలు భారీగా పతనం- కారణమిదే...

ఒపెక్​, మిత్రదేశాల మధ్య ఇవాళ జరగాల్సిన సమావేశం గురువారానికి వాయిదా పడింది. ఇంధన మార్కెట్లకు మద్దతు ఇవ్వడానికి... ఒపెక్​ దేశాలు వేగంగా చర్యలు తీసుకుంటాయనే ఆశలు మసకబారిన నేపథ్యంలో .. ఇవాళ చమురు ధరలు భారీగా పతనమయ్యాయి.

Oil prices fall as doubts grow over output cut deal
భారీగా పతనమైన చమురు ధరలు.. కారణమిదే
author img

By

Published : Apr 6, 2020, 11:11 AM IST

ఉత్పత్తి తగ్గింపుపై ఒపెక్​, మిత్రదేశాల మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో సోమవారం చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కరోనా​ ధాటికి విలవిలలాడుతున్న ఇంధన మార్కెట్లకు మద్దతు ఇవ్వడానికి... ఒపెక్​ దేశాలు వేగంగా చర్యలు తీసుకుంటాయనే ఆశలు మసకబారుతున్నాయి.

యూఎస్ బెంచ్​మార్క్ వెస్ట్ టెక్సాస్​ ఇంటర్మీడియట్​... ఆసియాలో ఒకానొక దశలో 8 శాతం వరకు పడిపోయింది. తరువాత 5.7 శాతం వరకు పుంజుకుంది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 26.72 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ బెంచ్​మార్క్​ బ్రెంట్ క్రూడ్​ 4.3 శాతం క్షీణించి 32.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పతనానికి కారణం

కరోనా ప్రభావం, రష్యా, సౌదీ అరేబియా మధ్య ధరల యుద్ధం కారణంగా మునుపెన్నడూ చూడని స్థాయిలో చమురు ధరలు పతనమవుతున్నాయి. ఇది చమురు ఎగుమతిపై ప్రధానంగా ఆధారపడిన ఒపెక్ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.

ప్రయాణ ఆంక్షలు, వ్యాపారాలు మూతపడడం, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న ఇతర చర్యలు కూడా చమురు డిమాండ్​ను దెబ్బతీస్తున్నాయి.

ఆశలు...

రష్యా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి తగ్గింపునకు (10 మిలియన్​ బ్యారెల్స్ వరకు) ఇరుదేశాలు అంగీకరించే అవకాశముందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఇంతకు ముందు ఆశాభావం వ్యక్తం చేశారు.

శుక్రవారం, రష్యా కూడా రోజుకు 10 మిలియన్ బ్యారెల్స్ పరిమాణంలో చమురు ఉత్పత్తి తగ్గించుకోవడంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దీనితో 18 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన చమురు ధరలు కొంత మేరకు పుంజుకున్నాయి.

అడియాసలు

చమురు ఉత్పత్తి తగ్గింపుపై చర్చించడానికి... ఒపెక్, మిత్రదేశాలు, రష్యా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ సమావేశం గురువారం వరకు వాయిదా పడిందని అజర్​బైజాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చమురు సమస్యకు పరిష్కారం ఇప్పట్లో లభించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా రక్కసి' పోయినా 'ధరల భూతం' వదలదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.