అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర మరో 6 శాతం క్షీణించింది. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఐరోపా దేశాలకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఈ పతనానికి ప్రధాన కారణమైంది.
బ్రెంట్ ముడి చమురు ధర 5.8శాతం తగ్గి బ్యారెల్కు 34 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ ధర 6.2శాతం క్షీణించి బ్యారెల్కు 31 డాలర్లకు దిగొచ్చింది.
వారం నుంచి...
రష్యా, సౌదీ అరేబియా మధ్య చమురు యుద్ధంతో కొద్ది రోజులుగా క్రూడ్ ధరలు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ ప్రసంగానికి ముందు కాస్త పుంజుకున్నా... ఐరోపాకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
ఇదీ చూడండి: మరింత తగ్గిన చమురు ధర- వారిద్దరి మధ్య యుద్ధమే కారణం!