ETV Bharat / business

వరుసగా నాలుగో రోజూ పెట్రోల్​ మంట - దిల్లీలో డీజిల్​ ధర

దేశంలో మళ్లీ పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ (శుక్రవారం) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో పెట్రోలుపై 28పైసలు, డీజిల్​పై 31 పైసలు పెంచాయి.

petrol, diesel
వరుస నాలుగో రోజూ పెట్రోల్​ మంట
author img

By

Published : May 7, 2021, 9:05 AM IST

Updated : May 7, 2021, 1:21 PM IST

దేశవ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర శుక్రవారం 28 పైసలు పెరిగి.. రూ.91.27కు చేరింది. లీటర్​ డీజిల్​ ధర 31 పైసలు పెరిగింది. దీనితో లీటర్​ డీజిల్ ప్రస్తుతం రూ.81.73 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా ముండి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.

ఆ రాష్ట్రాలో సెంచరీ కొట్టిన పెట్రోల్​..

వరుస నాలుగో రోజు పెరిగిన పెట్రోల్​ ధర పెరగడం కారణంగా రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో ధరలు సెంచరీ కొట్టాయి. లీటరు పెట్రోల్​ ధర రూ. 102కు చేరింది. రాజస్థాన్​లోని గంగానగర్​ జిల్లాలో పెట్రల్​ రేటు 102.15గా ఉంది. మధ్యప్రదేశ్​లోని అనుప్పూర్​లో పెట్రోల్​ రేటు రూ.101.86 కు పెరిగింది. అయితే మహారాష్ట్రాలోని పర్భానీలో లీటరు పెట్రోల్​ రూ. 99.95గా ఉండి సెంచరీకి సిద్ధంగా ఉంది.

ఈ ఏడాది కాలంలో పెట్రోల్​ రేటు మూడంకెల మార్కును దాటడం ఇది రెండో సారి. మొదటగా ఫిబ్రవరిలో రూ.100 మార్కుని చేరింది.

ఇదీ చూడండి: గూగుల్​ 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​- 3 రోజులే ఆఫీస్​కు!

Last Updated : May 7, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.