బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆయిల్ కంపెనీ బ్రిటీష్ పెట్రోలియం భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో చమురు డిమాండ్ తగ్గి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సంక్షోభంలోకి జారుకున్నాయి. ఈ కారణంగా ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 10,000 మందిని తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు బ్రిటీష్ పెట్రోలియం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు మొత్తం 70 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 15 శాతం మంది సిబ్బందిపై ప్రభావం పడనుంది.
చమురు రంగంలో నెలకొన్న పరిస్థితులతో ప్రస్తుతం తాము ఆర్జిస్తున్న దానికన్నా.. ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని సంస్థ సీఈఓ బెర్నార్డ్ లూనే తమ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కోతతోనే కంపెనీ నిలదొక్కుకోగలదని అందులో పేర్కొన్నారు.
భారత్లో 7,500 మంది ఉద్యోగులు..
భారతీయ చమురు రంగంలోనూ.. బ్రిటీష్ పెట్రోలియంకు భారీ పెట్టుబడులు ఉన్నాయి. దేశంలో ఆయిల్, గ్యాస్, లూబ్రికెంట్స్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో ఈ సంస్థ దాదాపు 7,500 మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఇదీ చూడండి:పాలసీకి పంచ సూత్రాలు