ETV Bharat / business

Covaxin: భారత్​ బయోటెక్​కు ఆక్యుజెన్ చెల్లింపులు - భారత్ బయోటెక్ ఆక్యుజెన్ కెనడా

కొవాగ్జిన్ అభివృద్ధి చేసిన భారత్​ బయోటెక్​కు 15మిలియన్ డాలర్ల(రూ.109.23 కోట్లు)ను చెల్లించింది ఆక్యుజెన్ ఇంక్ సంస్థ. కెనడాలో ఈ టీకా పంపిణీకి ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందానికి ప్రతిగా ఈ చెల్లింపులు చేసింది. కెనడాలో టీకా అందుబాటులోకి రాగానే.. మరో 10మిలియన్ డాలర్లను చెల్లించనుంది.

COVAXIN-OCUGEN
భారత్ బయోటెక్​కు రూ. 109 కోట్లు చెల్లింపు
author img

By

Published : Jun 8, 2021, 11:54 AM IST

కెనడాలో కొవాగ్జిన్(Covaxin) పంపిణీకి భారత్​ బయోటెక్​తో ఒప్పందం కుదుర్చుకున్న ఆక్యుజెన్ ఇంక్... ఇందుకోసం 15మిలియన్ డాలర్ల(రూ.109.23 కోట్లు)ను చెల్లించింది. కెనడాలో కొవాగ్జిన్​ పంపిణీ ప్రారంభమైన నెల రోజుల్లోగా మరో 10మిలియన్ డాలర్లను చెల్లించనున్నట్లు ఆక్యుజెన్ తెలిపింది.

కెనడా మార్కెట్​లో కొవాగ్జిన్ పంపిణీపై ఈ నెల జూన్ 3న రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అమెరికా మార్కెట్​కు సంబంధించి వీరి మధ్య ఇప్పటికే ఒప్పందం ఉంది.

కొవాగ్జిన్‌కు(Covaxin) అమెరికాలో అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నామని, అదే దరఖాస్తును కెనడాలోనూ దాఖలు చేస్తామని ఆక్యుజన్ ఇదివరకే స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌ టీకా పలు రకాల కరోనా వైరస్‌ వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని, అందువల్ల ఈ టీకాను అమెరికా, కెనడా ప్రజలకు అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది.

ఇదీ చదవండి: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌.. రెండూ భేష్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.